Title (Indic)ఆతఁడేమి నీవేమి అవుఁగాము లిందులోనేమి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతఁడేమి నీవేమి అవుఁగాము లిందులోనేమి కాతరపుఁ దమకము కలదె యిద్దరికి (॥ఆత॥) మించుఁదేనె పెదవిపై మిరియాలు చల్లుదురా పంచదార చల్లుదురు పైపైఁగాక మంచిమాటలాడవే మరి వెంగేలేమిటికే కంచపుఁబొత్తువలపు కలసెనిద్దరికి (॥ఆత॥) కలువకన్నుచూపుల కాఁకలు చల్లుదురా చలువవెన్నెలతేట చల్లుటగాక కలయ సన్నసేయవే కడు జంకించనేఁటికే కలికి సిగ్గులపొత్తు కలదె యిద్దరికి (॥ఆత॥) పచ్చిగుబ్బలటు చూపి పంతాలు చల్లుదురా కొచ్చి మెరుఁగులు చల్లఁగూడుఁగాక ఇచ్చట శ్రీ వెంకటేశునెనసితివి రట్టేల గచ్చుల వీడేలపొత్తుకలదె యిద్దరికి English(||pallavi||) ādam̐ḍemi nīvemi avum̐gāmu liṁdulonemi kādarabum̐ damagamu kaladĕ yiddarigi (||āda||) miṁchum̐denĕ pĕdavibai miriyālu salludurā paṁchadāra salluduru paibaim̐gāga maṁchimāḍalāḍave mari vĕṁgelemiḍige kaṁchabum̐bŏttuvalabu kalasĕniddarigi (||āda||) kaluvagannusūbula kām̐kalu salludurā saluvavĕnnĕladeḍa salluḍagāga kalaya sannaseyave kaḍu jaṁkiṁchanem̐ṭige kaligi siggulabŏttu kaladĕ yiddarigi (||āda||) pachchigubbalaḍu sūbi paṁtālu salludurā kŏchchi mĕrum̐gulu sallam̐gūḍum̐gāga ichchaḍa śhrī vĕṁkaḍeśhunĕnasidivi raṭṭela gachchula vīḍelabŏttugaladĕ yiddarigi