Title (Indic)ఆతని చిత్తమెట్టిదో అదెరఁగను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతని చిత్తమెట్టిదో అదెరఁగను నీతితోడ నడపితే నెట్టుకొనే నేను (॥ఆతని॥) చలపట్టువద్దుగాని చనవిచ్చి మన్నించితే చెలరేఁగి యెంతైనా సేవచేసేను అలుగఁగనోపఁగాని ఆసవెట్టి చెనకితే నలువంకనెంతైనా నవ్వే నేను (॥ఆతని॥) కపటము వద్దుగాని కడుఁబొందు సేసితేను యెపుడైనా తనమాటకియ్యకొనేను నెపమెంచనోపఁగాని నేరుపున లాలించితే వుపమలఁ దనచేఁతకొడఁబడే నేను (॥ఆతని॥) మచ్చరము వద్దుగాని మంచితనానఁ గూడితే మచ్చికఁ దన్నునిట్లా మరిగే నేను తచ్చనలకోపఁ గాని తగిలి శ్రీవేంకటేశుఁ డిచ్చట నన్నేలినాఁడు యిరవైతి నేను English(||pallavi||) ādani sittamĕṭṭido adĕram̐ganu nīdidoḍa naḍabide nĕṭṭugŏne nenu (||ādani||) salabaṭṭuvaddugāni sanavichchi manniṁchide sĕlarem̐gi yĕṁtainā sevasesenu alugam̐ganobam̐gāni āsavĕṭṭi sĕnagide naluvaṁkanĕṁtainā navve nenu (||ādani||) kabaḍamu vaddugāni kaḍum̐bŏṁdu sesidenu yĕbuḍainā tanamāḍagiyyagŏnenu nĕbamĕṁchanobam̐gāni nerubuna lāliṁchide vubamalam̐ danasem̐tagŏḍam̐baḍe nenu (||ādani||) machcharamu vaddugāni maṁchidanānam̐ gūḍide machchigam̐ dannuniṭlā marige nenu tachchanalagobam̐ gāni tagili śhrīveṁkaḍeśhum̐ ḍichchaḍa nannelinām̐ḍu yiravaidi nenu