Title (Indic)ఆపె చేసిన చేఁతకు అమరునా నీ మేలు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆపె చేసిన చేఁతకు అమరునా నీ మేలు మోపులు గట్టేవు యింతి మునుకొన్న సుద్దులు (॥ఆప॥) చుట్టుపు వరుసనాకె సుద్దులెల్లా నిన్నడిగి అట్టె కప్పురము మోవి అంది యిచ్చెను ముట్టి పయ్యదకొంగు నీముంజేతఁ జుట్టుకొని బట్టుబయలీఁదించేవు పడఁతి చన్నులను (॥ఆప॥) మంచితనముననె మచ్చికలు నీకుఁ జూపి అంచగమన బాగాలు అంది యిచ్చెను ముంచిన వేడుకతో మునివేళ్ళ శిరసెత్తి అంచలఁ దేలించేవు అంగనచూపులను (॥ఆప॥) ఒడఁబాటుతోఁ గూడి నిన్నొరసినలమేల్మంగ అడియాలమగు సొమ్ములంది యిచ్చెను తొడఁదొడ మోయ కాలుదొక్కి శ్రీవెంకటేశ పడియించేవు చెమట వనితదేహమున English(||pallavi||) ābĕ sesina sem̐tagu amarunā nī melu mobulu gaṭṭevu yiṁti munugŏnna suddulu (||āba||) suṭṭubu varusanāgĕ suddulĕllā ninnaḍigi aṭṭĕ kappuramu movi aṁdi yichchĕnu muṭṭi payyadagŏṁgu nīmuṁjedam̐ juṭṭugŏni baṭṭubayalīm̐diṁchevu paḍam̐ti sannulanu (||āba||) maṁchidanamunanĕ machchigalu nīgum̐ jūbi aṁchagamana bāgālu aṁdi yichchĕnu muṁchina veḍugado muniveḽḽa śhirasĕtti aṁchalam̐ deliṁchevu aṁganasūbulanu (||āba||) ŏḍam̐bāḍudom̐ gūḍi ninnŏrasinalamelmaṁga aḍiyālamagu sŏmmulaṁdi yichchĕnu tŏḍam̐dŏḍa moya kāludŏkki śhrīvĕṁkaḍeśha paḍiyiṁchevu sĕmaḍa vanidadehamuna