Title (Indic)ఆ పోలికౌనో కాదో అట్టే నీవు చూచుకొమ్మా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆ పోలికౌనో కాదో అట్టే నీవు చూచుకొమ్మా పూఁపలై వలపులెల్లా పూచినట్లున్నది (॥ఆపో॥) తగులు కొనెనో మెడఁ దరుణి చూపులెల్లా అగపడి కల్వదండలై వున్నవి చిగురుఁబాదాల నిగ్గు జెడగట్టెనో అప్పటి తగి యల్లదె తులసి దండ వలె నున్నది (॥ఆపో॥) చిక్కుకొనెనో నొసలఁ జెలియ నగవులెల్లా అక్కర ముత్తెపు నామమై నీకున్నది జక్కవ చన్నుల నీడ సరి నీ యందునంటెనో నిక్కి నీ చేతుల సంకుఁ జక్కురాలైవున్నవి (॥ఆపో॥) మొలచెనో నీవు రాన ముంచి యలమేలుమంగ మలసి తానే కౌస్తుభమణి యైనది అలరి శ్రీ వేంకటేశ కలసెనో తా భూసతై నిలిచి శ్యామ వర్ణము నీమేనైవున్నది English(||pallavi||) ā poligauno kādo aṭṭe nīvu sūsugŏmmā pūm̐palai valabulĕllā pūsinaṭlunnadi (||ābo||) tagulu kŏnĕno mĕḍam̐ daruṇi sūbulĕllā agabaḍi kalvadaṁḍalai vunnavi sigurum̐bādāla niggu jĕḍagaṭṭĕno appaḍi tagi yalladĕ tulasi daṁḍa valĕ nunnadi (||ābo||) sikkugŏnĕno nŏsalam̐ jĕliya nagavulĕllā akkara muttĕbu nāmamai nīgunnadi jakkava sannula nīḍa sari nī yaṁdunaṁṭĕno nikki nī sedula saṁkum̐ jakkurālaivunnavi (||ābo||) mŏlasĕno nīvu rāna muṁchi yalamelumaṁga malasi tāne kaustubhamaṇi yainadi alari śhrī veṁkaḍeśha kalasĕno tā bhūsadai nilisi śhyāma varṇamu nīmenaivunnadi