Title (Indic)ఇరవైన సరసుఁడు యించుకంతలోఁ దెలుసు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇరవైన సరసుఁడు యించుకంతలోఁ దెలుసు సొరిదిఁ దప్పక యిట్టె చూచితేనే చాలదా (॥ఇరవై॥) నగవులే నయమైతే నాటుకోవా ప్రియములు తగవులఁ బెట్టఁగానే దాఁగీఁ గాక అగడు సేయకరావె ఆతనినేల దూరేవే మొగము చూచి చూచి మొక్కితేనే చాలదా (॥ఇరవై॥) కోరికలే కుప్పలైతే కొండంత గాదా వయసు ఆరితేరఁగా వెగటయ్యీఁ గాక పేరఁబెట్టకిఁక రావే పెనఁగనంతేశాలే మేరతోనే వొకమాట మెచ్చితేనే చాలదా (॥ఇరవై॥) మాటలెల్లా మూటలైతే మనసులొక్కంత గాదా పాటిసేయకుండఁగానే భ్రమసీఁ గాక యీటులేక శ్రీ వేంకటేశుఁ డింతి నిట్టే కూడె నీటుతో డనిఁకరావే నిలిచితేఁ జాలదా English(||pallavi||) iravaina sarasum̐ḍu yiṁchugaṁtalom̐ dĕlusu sŏridim̐ dappaga yiṭṭĕ sūsidene sāladā (||iravai||) nagavule nayamaide nāḍugovā priyamulu tagavulam̐ bĕṭṭam̐gāne dām̐gīm̐ gāga agaḍu seyagarāvĕ ādaninela dūreve mŏgamu sūsi sūsi mŏkkidene sāladā (||iravai||) korigale kuppalaide kŏṁḍaṁta gādā vayasu ārideram̐gā vĕgaḍayyīm̐ gāga peram̐bĕṭṭagim̐ka rāve pĕnam̐ganaṁteśhāle meradone vŏgamāḍa mĕchchidene sāladā (||iravai||) māḍalĕllā mūḍalaide manasulŏkkaṁta gādā pāḍiseyaguṁḍam̐gāne bhramasīm̐ gāga yīḍulega śhrī veṁkaḍeśhum̐ ḍiṁti niṭṭe kūḍĕ nīḍudo ḍanim̐karāve nilisidem̐ jāladā