Title (Indic)పూవుఁబోణుల కొలువే పుష్పయాగము WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) పూవుఁబోణుల కొలువే పుష్పయాగము పూవక పూచె నీకిట్టె పుష్పయాగము (॥పూవు॥) కలువ రేకుల వంటి ఘనమైన కన్నుల పొలఁతుల చూపులె నీ పుష్పయాగము తలఁచి తలఁచి నిన్నుఁ దమమేనులఁ బొడమే పులకజొంపములె నీ పుష్పయాగము (॥పూవు॥) కరకమలములను కందువ గోపికలెల్లా పొరసి నినుఁ జూపుటే పుష్పయాగము సరసపు మాటలే సారెనాడి తమనవ్వు పొరి నీపైఁ జల్లుటే పుష్పయాగము (॥పూవు॥) గాఁట్టపుఁ గొలనిదండఁ గాంతలు సిగ్గున నిన్ను బూటకానకుఁ దిట్టుటే పుష్పయాగము యీటున శ్రీ వేంకటేశ యిట్టె యలమేలుమంగ పూఁటవూఁటరతులివి పుష్పయాగము English(||pallavi||) pūvum̐boṇula kŏluve puṣhpayāgamu pūvaga pūsĕ nīgiṭṭĕ puṣhpayāgamu (||pūvu||) kaluva regula vaṁṭi ghanamaina kannula pŏlam̐tula sūbulĕ nī puṣhpayāgamu talam̐si talam̐si ninnum̐ damamenulam̐ bŏḍame pulagajŏṁpamulĕ nī puṣhpayāgamu (||pūvu||) karagamalamulanu kaṁduva gobigalĕllā pŏrasi ninum̐ jūbuḍe puṣhpayāgamu sarasabu māḍale sārĕnāḍi tamanavvu pŏri nībaim̐ jalluḍe puṣhpayāgamu (||pūvu||) gām̐ṭṭabum̐ gŏlanidaṁḍam̐ gāṁtalu sigguna ninnu būḍagānagum̐ diṭṭuḍe puṣhpayāgamu yīḍuna śhrī veṁkaḍeśha yiṭṭĕ yalamelumaṁga pūm̐ṭavūm̐ṭaradulivi puṣhpayāgamu