Title (Indic)ఆకాశపాకాశ మాయెఁ గోమలినడుము WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆకాశపాకాశ మాయెఁ గోమలినడుము వైకుంఠపతి పొందు వడిఁ దెలుపుకొఱకు (॥ఆకాశ॥) పరగఁ గెమ్మోవిపై పగలు చుక్కలు వొడిచె పరివేషమృగనాభిఁ బరగె మోము మరునిసమరమునఁ గోమలి విభునితోఁ జెనకు సరసతల కిదియ సూచన చంద మాయె (॥ఆకాశ॥) ఎలమి బొమ్మలజంకె లింద్రధనువులు వొడిచె మొలచెఁ గన్నులఁగావి మొయిలు ఘనమై కొలఁది కగ్గలపుఁగుంకుమచెమట నెత్తురులు పొలఁతిపైఁ గురియుటకుఁ బోటివలె నాయె (॥ఆకాశ॥) అంగనకునెడమతొడ అదరి భూకంపంబు సంగతి వహించెఁ జంచలము లేక ఇంగితంబుగ వేంకటేశుఁ గూడినపొందు కొంగుబంగారమై కోరికలు మీఱె English(||pallavi||) āgāśhabāgāśha māyĕm̐ gomalinaḍumu vaiguṁṭhabadi pŏṁdu vaḍim̐ dĕlubugŏṟagu (||āgāśha||) paragam̐ gĕmmovibai pagalu sukkalu vŏḍisĕ pariveṣhamṛganābhim̐ baragĕ momu marunisamaramunam̐ gomali vibhunidom̐ jĕnagu sarasadala kidiya sūsana saṁda māyĕ (||āgāśha||) ĕlami bŏmmalajaṁkĕ liṁdradhanuvulu vŏḍisĕ mŏlasĕm̐ gannulam̐gāvi mŏyilu ghanamai kŏlam̐di kaggalabum̐guṁkumasĕmaḍa nĕtturulu pŏlam̐tibaim̐ guriyuḍagum̐ boḍivalĕ nāyĕ (||āgāśha||) aṁganagunĕḍamadŏḍa adari bhūgaṁpaṁbu saṁgadi vahiṁchĕm̐ jaṁchalamu lega iṁgidaṁbuga veṁkaḍeśhum̐ gūḍinabŏṁdu kŏṁgubaṁgāramai korigalu mīṟĕ