Title (Indic)ఆన వెట్టుదువు నీవప్పటి నా నోరణఁచి వోరి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆన వెట్టుదువు నీవప్పటి నా నోరణఁచి వోరి నీ నిజానకు నాతో నేఁడైన మానరా (॥ఆన॥) పచ్చడాన జవ్వాది పరిమళమేడదిరా పచ్చిసేఁతలు చెక్కిళ్ళపై నీకేడవిరా గచ్చు మోవిమీఁదనున్న కసిగాటులేడవిరా యిచ్చకుఁడ కనుఁగెంపులేడవి గలిగెరా (॥ఆన॥) ముద్దుల చక్కని నీదు మోముకళలేడవిరా కొద్దిగాని సందొత్తుగోరేడదిరా గద్దరీఁడ యీ చిట్లు గందము నీకేడదిరా తిద్దెను గస్తూరిబొట్టు దిమ్మరి యెవ్వతెరా (॥ఆన॥) భీతితో నీవాడేటి తబ్బిబ్బుమాటలేడవిరా రాతిరేడ నుండితి వెరవక చెప్పరా యేతరీఁడ తిరువేంకటేశ నన్ను నేలితివి యేతులతో వలపించ నెంత కలికివిరా English(||pallavi||) āna vĕṭṭuduvu nīvappaḍi nā noraṇam̐si vori nī nijānagu nādo nem̐ḍaina mānarā (||āna||) pachchaḍāna javvādi parimaḽameḍadirā pachchisem̐talu sĕkkiḽḽabai nīgeḍavirā gachchu movimīm̐danunna kasigāḍuleḍavirā yichchagum̐ḍa kanum̐gĕṁpuleḍavi galigĕrā (||āna||) muddula sakkani nīdu momugaḽaleḍavirā kŏddigāni saṁdŏttugoreḍadirā gaddarīm̐ḍa yī siṭlu gaṁdamu nīgeḍadirā tiddĕnu gastūribŏṭṭu dimmari yĕvvadĕrā (||āna||) bhīdido nīvāḍeḍi tabbibbumāḍaleḍavirā rādireḍa nuṁḍidi vĕravaga sĕpparā yedarīm̐ḍa tiruveṁkaḍeśha nannu nelidivi yedulado valabiṁcha nĕṁta kaligivirā