Title (Indic)ఆయంబిది తెలియంగల దీయాత్మజ్ఞానంబు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆయంబిది తెలియంగల దీయాత్మజ్ఞానంబు మాయలు యీకాలము కర్మము మాధవునాధీనము (॥ఆయంబిది॥) దేహమునకు నీడ తిరిగినయటువలెనే శ్రీహరికి కళావిధమై జీవుఁడటు దిరుగు దేహమునకుఁ గల చైతన్యము తెగి నీడకులేదు శ్రీహరికిని గల స్వతంత్రము జీవునికిలేదు (॥ఆయంబిది॥) కలలోపలఁ గల సుఖము ఘనసంతోషము కొరకే యిల లోపలఁ గలిగిన సుఖము ఇది సంతోషము కొరకే కలలోపలి విజీవుని సంకల్పన లిన్నియును ఇల లోపలి ప్రపంచ మింతయు నీశ్వరుసంకల్పము (॥ఆయంబిది॥) చెదరిని బాహ్యపునిషయములు జీవునిపాలిటివి పదిలంబగు అంతరంగమే పరమపువైకుంఠము అదనెరిఁగి కాలగాలమున ఆతుమ శ్రీవేంకటపతికి పొదిగియాతనికి శరణనికొలిచిన పొందగుముక్తికియిదిగీలు English(||pallavi||) āyaṁbidi tĕliyaṁgala dīyātmajñānaṁbu māyalu yīgālamu karmamu mādhavunādhīnamu (||āyaṁbidi||) dehamunagu nīḍa tiriginayaḍuvalĕne śhrīharigi kaḽāvidhamai jīvum̐ḍaḍu dirugu dehamunagum̐ gala saidanyamu tĕgi nīḍaguledu śhrīharigini gala svadaṁtramu jīvunigiledu (||āyaṁbidi||) kalalobalam̐ gala sukhamu ghanasaṁtoṣhamu kŏrage yila lobalam̐ galigina sukhamu idi saṁtoṣhamu kŏrage kalalobali vijīvuni saṁkalbana linniyunu ila lobali prabaṁcha miṁtayu nīśhvarusaṁkalbamu (||āyaṁbidi||) sĕdarini bāhyabuniṣhayamulu jīvunibāliḍivi padilaṁbagu aṁtaraṁgame paramabuvaiguṁṭhamu adanĕrim̐gi kālagālamuna āduma śhrīveṁkaḍabadigi pŏdigiyādanigi śharaṇanigŏlisina pŏṁdagumuktigiyidigīlu