Title (Indic)శరణాగత వజ్రపంజరుఁ డీతఁడు చక్రధరుఁ డసురసంహారుఁడు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) శరణాగత వజ్రపంజరుఁ డీతఁడు చక్రధరుఁ డసురసంహారుఁడు వెరవుతోడఁ దను శరణనువారి వెనుబల మీతఁడే రక్షకుఁడు (॥శర॥) హరినామోచ్చారణఁ దెగనికర్మ మవల వేరొకటున్నదా అరసి యెందు నమ్మిక చాలక ప్రాయశ్చిత్తంబులు చెప్పుదురు ధర నెరఁగనివారేమనినాఁ దామసులగొడవ యేమిటికి హరిహరి యంటే దురితము లణఁగెను అతఁడే మాకిఁక రక్షకుఁడు (॥శర॥) శ్రీపతి దిక్కయి కావఁగ మరియునుఁ జేరని సంపద లిఁకనేవి చాపలబుద్ధుల (లు?) నది నమ్మక విచ్చనవిడి నోములు చెప్పుదురు తీపులు పుట్టించి యెవ్వరేమనినఁ దెలిపి వాదడువ నేమిటికి శ్రీపతిఁ గొలిచితి చేరె సంపదలు జిగి నితఁడే మా రక్షకుఁడు (॥శర॥) అంతరాత్మ శ్రీవేంకటేశ్వరుఁడు అన్యము భజించఁ జో టేది యింతట నమ్మక దేవతాంతరము లేఁటేఁటివో మరి చెప్పుదురు యెంతలేదు ప్రాకృతజనముల భ్రమ యెవ్వరిఁ గాదన నేమిటికి యింతకు శ్రీవేంకటేశుదాసులము యీతఁడే మాకిఁక రక్షకుఁడు English(||pallavi||) śharaṇāgada vajrabaṁjarum̐ ḍīdam̐ḍu sakradharum̐ ḍasurasaṁhārum̐ḍu vĕravudoḍam̐ danu śharaṇanuvāri vĕnubala mīdam̐ḍe rakṣhagum̐ḍu (||śhara||) harināmochchāraṇam̐ dĕganigarma mavala verŏgaḍunnadā arasi yĕṁdu nammiga sālaga prāyaśhchittaṁbulu sĕppuduru dhara nĕram̐ganivāremaninām̐ dāmasulagŏḍava yemiḍigi harihari yaṁṭe duridamu laṇam̐gĕnu adam̐ḍe māgim̐ka rakṣhagum̐ḍu (||śhara||) śhrībadi dikkayi kāvam̐ga mariyunum̐ jerani saṁpada lim̐kanevi sābalabuddhula (lu?) nadi nammaga vichchanaviḍi nomulu sĕppuduru tībulu puṭṭiṁchi yĕvvaremaninam̐ dĕlibi vādaḍuva nemiḍigi śhrībadim̐ gŏlisidi serĕ saṁpadalu jigi nidam̐ḍe mā rakṣhagum̐ḍu (||śhara||) aṁtarātma śhrīveṁkaḍeśhvarum̐ḍu anyamu bhajiṁcham̐ jo ṭedi yiṁtaḍa nammaga devadāṁtaramu lem̐ṭem̐ṭivo mari sĕppuduru yĕṁtaledu prākṛtajanamula bhrama yĕvvarim̐ gādana nemiḍigi yiṁtagu śhrīveṁkaḍeśhudāsulamu yīdam̐ḍe māgim̐ka rakṣhagum̐ḍu