Title (Indic)ఏపొద్దూ నీచేఁతలెల్లా యెదుటనే కానవచ్చీ WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఏపొద్దూ నీచేఁతలెల్లా యెదుటనే కానవచ్చీ వీఁపు గానరాఁగా దాఁగే విద్య నీది గాక (॥ఏపొ॥) పుట్టిన మెకానకుఁ బూరి మేయ నేరిపిరా అట్టె పిల్లలఁ బెట్ట నటు నేర్పిరా చుట్టి నీళ్లున్నచోటు సోదించ నేరిపిరా మట్టులేని దింతా నీమాయ యింతేకాక (॥ఏపొ॥) తీవెలకుఁ జుట్టి చుట్టి దిక్కులఁ బాఁక నేరిపిరా తావులఁ దతికాలానఁ బూవ నేరిపిరా వేవేలు పక్కొమ్మలు వెసఁ బెట్ట నేరిపిరా యేవలఁ జూచినా నీమహిమ లింతేగాక (॥ఏపొ॥) కోరి పక్షులు కొరులు గూండ్లువెట్ట నేరిపిరా సారె జాతియ్యాహారాలచవి నేర్పిరా యీరీతి శ్రీవేంకటేశ యిన్నియు లోకములోన చేరి నీవు సేసిన సృష్టి యింతే కాక English(||pallavi||) ebŏddū nīsem̐talĕllā yĕduḍane kānavachchī vīm̐pu gānarām̐gā dām̐ge vidya nīdi gāga (||ebŏ||) puṭṭina mĕgānagum̐ būri meya neribirā aṭṭĕ pillalam̐ bĕṭṭa naḍu nerbirā suṭṭi nīḽlunnasoḍu sodiṁcha neribirā maṭṭuleni diṁtā nīmāya yiṁtegāga (||ebŏ||) tīvĕlagum̐ juṭṭi suṭṭi dikkulam̐ bām̐ka neribirā tāvulam̐ dadigālānam̐ būva neribirā vevelu pakkŏmmalu vĕsam̐ bĕṭṭa neribirā yevalam̐ jūsinā nīmahima liṁtegāga (||ebŏ||) kori pakṣhulu kŏrulu gūṁḍluvĕṭṭa neribirā sārĕ jādiyyāhārālasavi nerbirā yīrīdi śhrīveṁkaḍeśha yinniyu logamulona seri nīvu sesina sṛṣhṭi yiṁte kāga