Title (Indic)ఆహా యేమి చేప్పేది హరి నీమాయ WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆహా యేమి చేప్పేది హరి నీమాయ మోహములే చిగిరించీ మొదల జవ్వనము (॥ఆహా॥) యెంచఁగ భూమి యొక్కటే యేలినరాజు లెందరో పొంచి వారివెంటవెంటఁ బోవదాయను అంచల సూర్యచంద్రులనే గడెకుడుకల ముంచి కొలచి పోసీని మునుకొని కాలము (॥ఆహా॥) దేవలోక మొక్కటే దేవేంద్రు లెందరో కైవశమై యేలఁగ నొక్కరిదీ గాదు ఆవటించి పంచభూతాలనేటి శాఖలు వెళ్లి సావధానానఁ బెరిగీ సంసారవృక్షము (॥ఆహా॥) యిచ్చట నీ వొక్కఁడవే యిటు నీదాసు లెందరో తచ్చి యెంత సేవించినాఁ దనివిలేదు నిచ్చలు శ్రీవేంకటేశ నిదానము నీభక్తి యెచ్చినాఁడ వింతటా నీడేరీ జన్మము English(||pallavi||) āhā yemi seppedi hari nīmāya mohamule sigiriṁchī mŏdala javvanamu (||āhā||) yĕṁcham̐ga bhūmi yŏkkaḍe yelinarāju lĕṁdaro pŏṁchi vārivĕṁṭavĕṁṭam̐ bovadāyanu aṁchala sūryasaṁdrulane gaḍĕguḍugala muṁchi kŏlasi posīni munugŏni kālamu (||āhā||) devaloga mŏkkaḍe deveṁdru lĕṁdaro kaivaśhamai yelam̐ga nŏkkaridī gādu āvaḍiṁchi paṁchabhūdālaneḍi śhākhalu vĕḽli sāvadhānānam̐ bĕrigī saṁsāravṛkṣhamu (||āhā||) yichchaḍa nī vŏkkam̐ḍave yiḍu nīdāsu lĕṁdaro tachchi yĕṁta seviṁchinām̐ daniviledu nichchalu śhrīveṁkaḍeśha nidānamu nībhakti yĕchchinām̐ḍa viṁtaḍā nīḍerī janmamu