Title (Indic)ఆర్పులు బొబ్బలు నవె వినుఁడు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆర్పులు బొబ్బలు నవె వినుఁడు యేర్పడ నసురల నిటువలె గెలిచే (॥ఆర్పు॥) కూలిన తలలును గుఱ్ఱపు డొక్కలు నేలపైఁ బారిన నెత్తురులు వోలిఁ జూడుఁ డిదె వుద్ధగళలీ రణ- కేలిని విష్వక్సేనుఁడు గెలిచె (॥ఆర్పు॥) పడిన రథంబులు బాహుదండములు కెడసిన గజములు గొడగులును అడియాలము లివె అక్కడ విక్కడ చిడుముడి విష్వక్సేనుఁడు గెలిచె (॥ఆర్పు॥) పగుల పగుల వృషభాసురునిఁ జంపె పగ నీఁగె అతని బలములతో అగపడి శ్రీవేంకటాధిపు పంపున జిగిగల విష్వక్సేనుఁడు గెలిచె English(||pallavi||) ārbulu bŏbbalu navĕ vinum̐ḍu yerbaḍa nasurala niḍuvalĕ gĕlise (||ārbu||) kūlina talalunu guṭrabu ḍŏkkalu nelabaim̐ bārina nĕtturulu volim̐ jūḍum̐ ḍidĕ vuddhagaḽalī raṇa- kelini viṣhvaksenum̐ḍu gĕlisĕ (||ārbu||) paḍina rathaṁbulu bāhudaṁḍamulu kĕḍasina gajamulu gŏḍagulunu aḍiyālamu livĕ akkaḍa vikkaḍa siḍumuḍi viṣhvaksenum̐ḍu gĕlisĕ (||ārbu||) pagula pagula vṛṣhabhāsurunim̐ jaṁpĕ paga nīm̐gĕ adani balamulado agabaḍi śhrīveṁkaḍādhibu paṁpuna jigigala viṣhvaksenum̐ḍu gĕlisĕ