Title (Indic)చెల్ల నెక్కికొంటివిగా జీవుఁడ యీబలుకోటా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చెల్ల నెక్కికొంటివిగా జీవుఁడ యీబలుకోటా బల్లిదుఁడ నీకు నేఁడు పట్టమాయఁ గోటా (॥చెల్ల॥) తొమ్మిది గవనులైన దొడ్డతోలుఁ గోటా కొమ్ముల చవుల మూల కొత్తళాల కోటా వమ్ములేని మెడవంపు వంకదార కోటా పమ్మి పగవారినెల్లా పట్టుకొన్న కోటా (॥చెల్ల॥) తలవాకిలి దంతపుతలుపుల కోటా తలిరుఁ జేతుల పెద్దదంతెనాల కోటా వెలియాసలనే దండువిడిసిన కోటా గులుగై యింద్రియములు కొల్ల గొన్న కోటా (॥చెల్ల॥) నడచప్పరములనే నలువైన కోటా జడిసిన చెవుల మించు సవరణ కోటా పడనిపాట్లఁ బడి ఫలియించెఁ గోటా యెడమిచ్చి శ్రీవేంకటేశుఁ డేలేఁ గోటా English(||pallavi||) sĕlla nĕkkigŏṁṭivigā jīvum̐ḍa yībalugoḍā ballidum̐ḍa nīgu nem̐ḍu paṭṭamāyam̐ goḍā (||sĕlla||) tŏmmidi gavanulaina dŏḍḍadolum̐ goḍā kŏmmula savula mūla kŏttaḽāla koḍā vammuleni mĕḍavaṁpu vaṁkadāra koḍā pammi pagavārinĕllā paṭṭugŏnna koḍā (||sĕlla||) talavāgili daṁtabudalubula koḍā talirum̐ jedula pĕddadaṁtĕnāla koḍā vĕliyāsalane daṁḍuviḍisina koḍā gulugai yiṁdriyamulu kŏlla gŏnna koḍā (||sĕlla||) naḍasapparamulane naluvaina koḍā jaḍisina sĕvula miṁchu savaraṇa koḍā paḍanibāṭlam̐ baḍi phaliyiṁchĕm̐ goḍā yĕḍamichchi śhrīveṁkaḍeśhum̐ ḍelem̐ goḍā