Title (Indic)వేసరకు వీఁడేల యనకుము విడువ నిన్నిఁక శరణు చొచ్చితి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) వేసరకు వీఁడేల యనకుము విడువ నిన్నిఁక శరణు చొచ్చితి నీ సరెవ్వరు లేరు వెదకిన నిండుబండికిఁ జేటవేఁ గా (॥వేస॥) మీరు నాకుఁ గలరు నేనేమి సేసినఁ గాతురనియెడి- ధీరతను జము సరకు గొనకే తివిరిఁ సేసితిఁ బాపము వోరసేయుచు నెంతలేదని వూరకే మీరుంటిరేనియు వారికినిఁ గొరగాను నే నెవ్వరిని నెఱఁగను మిమ్మేకాని (॥వేస॥) మిమ్ముఁ గొలిచిన గర్వమున నేమీఁ జేయక కాలమందే నమ్మి కర్మములెల్ల మానితి నాకు నాకే వేసరి దొమ్మి కోపక మీకు నాకును దూరమనుచుఁ బరాకుచేసిన యిమ్ములను నన్నవియు రోసును యేల నాకవి నీవేకాక (॥వేస॥) నీకు మొక్కిన మందెమేళము నే నొక కొండ సేసుక లోకముల దేవతలకెల్లను లోను వెలిగానైతి యీకడను శ్రీవేంకటేశుఁడ యిప్పుడిటు ననుఁ గరుణఁజూచితి చేకొనుచు వారె మెత్తురు చెలఁగి నీకింకరుఁడననుచు English(||pallavi||) vesaragu vīm̐ḍela yanagumu viḍuva ninnim̐ka śharaṇu sŏchchidi nī sarĕvvaru leru vĕdagina niṁḍubaṁḍigim̐ jeḍavem̐ gā (||vesa||) mīru nāgum̐ galaru nenemi sesinam̐ gāduraniyĕḍi- dhīradanu jamu saragu gŏnage tivirim̐ sesidim̐ bābamu voraseyusu nĕṁtaledani vūrage mīruṁṭireniyu vāriginim̐ gŏragānu ne nĕvvarini nĕṟam̐ganu mimmegāni (||vesa||) mimmum̐ gŏlisina garvamuna nemīm̐ jeyaga kālamaṁde nammi karmamulĕlla mānidi nāgu nāge vesari dŏmmi kobaga mīgu nāgunu dūramanusum̐ barāgusesina yimmulanu nannaviyu rosunu yela nāgavi nīvegāga (||vesa||) nīgu mŏkkina maṁdĕmeḽamu ne nŏga kŏṁḍa sesuga logamula devadalagĕllanu lonu vĕligānaidi yīgaḍanu śhrīveṁkaḍeśhum̐ḍa yippuḍiḍu nanum̐ garuṇam̐jūsidi segŏnusu vārĕ mĕtturu sĕlam̐gi nīgiṁkarum̐ḍananusu