Title (Indic)ఆతుమ సంతసపెట్టు టది యెఱుక, తా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతుమ సంతసపెట్టు టది యెఱుక, తా- నేతెరవు నొల్లకుండు టిదియే యెఱుక (॥ఆతు॥) ముంచినబంధములలో ముణుఁగుడువడక తా- నంచల విడఁదన్ను టది యెఱుక చంచలపువిషయాల సగ్గుడుముగ్గుడుగాక యెంచిఁ హరిఁదలపోయు టిదియే యెఱుక (॥ఆతు॥) పాయనియర్ధములకు బంటుబంటై తిరుగక ఆయతమై మోసపోని దది యెఱుక పాయపుఁగామినులతోఁ బలుమారుఁ జేయుపొందు హేయమనితలపోయు టిదియే యెఱుక (॥ఆతు॥) ధరమీఁదఁగల ప్రాణితతుల నొప్పించక ఆరయఁగ సముఁడగు టది యెఱుక గరిమల శ్రీవేంకటపతిదాసుఁడై యిరవొంద సుఖించు టిదియే యెఱుక English(||pallavi||) āduma saṁtasabĕṭṭu ṭadi yĕṟuga, tā- nedĕravu nŏllaguṁḍu ṭidiye yĕṟuga (||ādu||) muṁchinabaṁdhamulalo muṇum̐guḍuvaḍaga tā- naṁchala viḍam̐dannu ṭadi yĕṟuga saṁchalabuviṣhayāla sagguḍumugguḍugāga yĕṁchim̐ harim̐dalaboyu ṭidiye yĕṟuga (||ādu||) pāyaniyardhamulagu baṁṭubaṁṭai tirugaga āyadamai mosaboni dadi yĕṟuga pāyabum̐gāminuladom̐ balumārum̐ jeyubŏṁdu heyamanidalaboyu ṭidiye yĕṟuga (||ādu||) dharamīm̐dam̐gala prāṇidadula nŏppiṁchaga ārayam̐ga samum̐ḍagu ṭadi yĕṟuga garimala śhrīveṁkaḍabadidāsum̐ḍai yiravŏṁda sukhiṁchu ṭidiye yĕṟuga