Title (Indic)ఎందుఁ జూచినఁ దనకు నిన్నియును నిట్లనే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఎందుఁ జూచినఁ దనకు నిన్నియును నిట్లనే కందులేని సుఖము కలనైన లేదు (॥ఎందు॥) సిరులు గలిగిన ఫలము చింతఁ బొరలనె కాని సొలది సంతోష మించుకయైన లేదు తరుణి గల ఫలము వేదనలఁ బొరలుటె కాని నెరసులేని సుఖము నిమిషంబు లేదు (॥ఎందు॥) తనువుగల ఫలము పాతకము సేయనె కాని అనువైన పుణ్యంబు అది యింత లేదు మనసుగల ఫలము దుర్మతిఁబొందనే కాని ఘనమనోజ్ఞాన సంగతి గొంత లేదు (॥ఎందు॥) చదువుగలిగిన ఫలము సంశయంబే కాని సదమల జ్ఞాననిశ్చయ మింత లేదు యిది యెరిఁగి తిరువేంకటేశ్వరునిఁ గొలిచినను బ్రదుకు గలుగును భవము ప్రాణులకు లేదు English(||pallavi||) ĕṁdum̐ jūsinam̐ danagu ninniyunu niṭlane kaṁduleni sukhamu kalanaina ledu (||ĕṁdu||) sirulu galigina phalamu siṁtam̐ bŏralanĕ kāni sŏladi saṁtoṣha miṁchugayaina ledu taruṇi gala phalamu vedanalam̐ bŏraluḍĕ kāni nĕrasuleni sukhamu nimiṣhaṁbu ledu (||ĕṁdu||) tanuvugala phalamu pādagamu seyanĕ kāni anuvaina puṇyaṁbu adi yiṁta ledu manasugala phalamu durmadim̐bŏṁdane kāni ghanamanojñāna saṁgadi gŏṁta ledu (||ĕṁdu||) saduvugaligina phalamu saṁśhayaṁbe kāni sadamala jñānaniśhchaya miṁta ledu yidi yĕrim̐gi tiruveṁkaḍeśhvarunim̐ gŏlisinanu bradugu galugunu bhavamu prāṇulagu ledu