Title (Indic)ఆపన్నులపాలి దైవమాతఁడే గతిఁ దక్క WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆపన్నులపాలి దైవమాతఁడే గతిఁ దక్క యే ప్రొద్దును భజియించఁగ నితరుఁడు మరి కలఁడా (॥ఆపన్ను॥) నిరుపాధిక నిజబంధుఁడు నిరతి శయానందుఁడు కరి వరదుఁ డితఁడే గాక ఘనుఁడధికుఁడు గలఁడా (॥ఆపన్ను॥) సంతత గుణ సంపన్నుఁడు సాధులకుఁ బ్రసన్నుఁడు అంతర్యామితఁడే కాక అధికుఁడు మరి కలఁడా (॥ఆపన్ను॥) పరమాత్ముఁడు పరమపురుషుఁడు పరికింపఁగఁ గృపాలుఁడు తిరువేంకట విభుఁడే కాక దేవుఁడు మరి కలఁడా English(||pallavi||) ābannulabāli daivamādam̐ḍe gadim̐ dakka ye prŏddunu bhajiyiṁcham̐ga nidarum̐ḍu mari kalam̐ḍā (||ābannu||) nirubādhiga nijabaṁdhum̐ḍu niradi śhayānaṁdum̐ḍu kari varadum̐ ḍidam̐ḍe gāga ghanum̐ḍadhigum̐ḍu galam̐ḍā (||ābannu||) saṁtada guṇa saṁpannum̐ḍu sādhulagum̐ brasannum̐ḍu aṁtaryāmidam̐ḍe kāga adhigum̐ḍu mari kalam̐ḍā (||ābannu||) paramātmum̐ḍu paramaburuṣhum̐ḍu parigiṁpam̐gam̐ gṛpālum̐ḍu tiruveṁkaḍa vibhum̐ḍe kāga devum̐ḍu mari kalam̐ḍā