Title (Indic)పాపమెరంగని బ్రాహ్మఁడు యెందుఁ WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) పాపమెరంగని బ్రాహ్మఁడు యెందుఁ జూపరానిచోటు చూపీనయ్యా (॥పాప॥) తనివోక జీవముతలకాయ నంజుడు పనివడి తిని తిన్న బ్రాహ్మఁడు యెనసి యెదిరిఁ దన్ను నెఱఁగక విభుఁడై ఘనవంశము మంటఁ గలపీనయ్యా (॥పాప॥) యెవ్వారు నెఱఁగనియెముకలయింటిలో పవ్వళింపుచునున్న బ్రహ్మఁడు జవ్వనమదమున జడినేటికోమలిఁ బువ్వులతోఁటలోఁ బొదిగీనయ్యా (॥పాప॥) చెలఁగి కన్నెరికము చెడనిపడుచుఁ దెచ్చి పలువేదనలఁబెట్టే బ్రహ్మఁడు, తెలిసి వేంకటాధిపునిదాసుఁడై పులుగు పంజారాన బొదిగీనయ్యా English(||pallavi||) pābamĕraṁgani brāhmam̐ḍu yĕṁdum̐ jūbarānisoḍu sūbīnayyā (||pāba||) tanivoga jīvamudalagāya naṁjuḍu panivaḍi tini tinna brāhmam̐ḍu yĕnasi yĕdirim̐ dannu nĕṟam̐gaga vibhum̐ḍai ghanavaṁśhamu maṁṭam̐ galabīnayyā (||pāba||) yĕvvāru nĕṟam̐ganiyĕmugalayiṁṭilo pavvaḽiṁpusununna brahmam̐ḍu javvanamadamuna jaḍineḍigomalim̐ buvvuladom̐ṭalom̐ bŏdigīnayyā (||pāba||) sĕlam̐gi kannĕrigamu sĕḍanibaḍusum̐ dĕchchi paluvedanalam̐bĕṭṭe brahmam̐ḍu, tĕlisi veṁkaḍādhibunidāsum̐ḍai pulugu paṁjārāna bŏdigīnayyā