Title (Indic)సామాన్యమా పూర్వసంగ్రహంబగు ఫలము WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) సామాన్యమా పూర్వసంగ్రహంబగు ఫలము నేమమున బెనగొనియె నేఁడు నీవనక (॥సామాన్య॥) జగతిఁ బ్రాణులకెల్ల సంసారబంధంబు తగుల బంధించు దురితంపుఁ గర్మమున మగుడ మారుకుమారు మగువ నీవురముపై తెగికట్టి రెవ్వరో దేవుండవనక (॥సామాన్య॥) పనిలేక జీవులను భవసాగరంబులో మునుఁగ లేవఁగఁ జేయు మోహదోషమున పనిపూని జలధిలోఁబండఁబెట్టిరి నిన్ను వెనకెవ్వరో మొదలివేలుపనక (॥సామాన్య॥) వుండనియ్యక జీవనోపాయమున మమ్ము కొండలను గొబల తతిగొని తిప్పుఫలము కొండలను నెలకొన్న కోనేటిపతివనఁగ నుండవలసెను నీకు నోపలేననక English(||pallavi||) sāmānyamā pūrvasaṁgrahaṁbagu phalamu nemamuna bĕnagŏniyĕ nem̐ḍu nīvanaga (||sāmānya||) jagadim̐ brāṇulagĕlla saṁsārabaṁdhaṁbu tagula baṁdhiṁchu duridaṁpum̐ garmamuna maguḍa mārugumāru maguva nīvuramubai tĕgigaṭṭi rĕvvaro devuṁḍavanaga (||sāmānya||) panilega jīvulanu bhavasāgaraṁbulo munum̐ga levam̐gam̐ jeyu mohadoṣhamuna panibūni jaladhilom̐baṁḍam̐bĕṭṭiri ninnu vĕnagĕvvaro mŏdalivelubanaga (||sāmānya||) vuṁḍaniyyaga jīvanobāyamuna mammu kŏṁḍalanu gŏbala tadigŏni tippuphalamu kŏṁḍalanu nĕlagŏnna koneḍibadivanam̐ga nuṁḍavalasĕnu nīgu nobalenanaga