Title (Indic)యెందూఁ దప్పించుకో రాదు యేమిటానుఁ బొద్దు వోదు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) యెందూఁ దప్పించుకో రాదు యేమిటానుఁ బొద్దు వోదు అందే పరాకు సేసుకో నలవి గాదు (॥॥) తలఁపునఁ బారును తన చక్కని రూపము వెలిఁదా నాడేమాటలు వినిన ట్టౌను కల గనినట్టౌను కన్నులు మూసుకొంటేను యెలమి నా భావ మిది యేమి సేతునే (॥॥) కడు సందు లదరును కౌఁగిలించుకొన్న ట్టౌను బడి నుండినట్టౌను పై పై నీడ వొడి వట్టి నట్టౌను వూరకే నా కోరికను వుడివోని నా యాస కుపమ యేదే (॥॥) చెనకినయ ట్టౌను సెలవి నవ్వులు వచ్చు చనుగవ యంటినట్టౌ సంతోసానను యెనసె శ్రీ వేంకటేశుఁ డింతలో విచ్చేసి నన్ను మనసు నిర్మల మాయ మరియు నే మందునే English(||pallavi||) yĕṁdūm̐ dappiṁchugo rādu yemiḍānum̐ bŏddu vodu aṁde parāgu sesugo nalavi gādu (||||) talam̐punam̐ bārunu tana sakkani rūbamu vĕlim̐dā nāḍemāḍalu vinina ṭṭaunu kala ganinaṭṭaunu kannulu mūsugŏṁṭenu yĕlami nā bhāva midi yemi sedune (||||) kaḍu saṁdu ladarunu kaum̐giliṁchugŏnna ṭṭaunu baḍi nuṁḍinaṭṭaunu pai pai nīḍa vŏḍi vaṭṭi naṭṭaunu vūrage nā koriganu vuḍivoni nā yāsa kubama yede (||||) sĕnaginaya ṭṭaunu sĕlavi navvulu vachchu sanugava yaṁṭinaṭṭau saṁtosānanu yĕnasĕ śhrī veṁkaḍeśhum̐ ḍiṁtalo vichchesi nannu manasu nirmala māya mariyu ne maṁdune