Title (Indic)యేల బయ లీఁదించేరే యింతులాల WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) యేల బయ లీఁదించేరే యింతులాల మేలిమి బత్తి గలిగితే మీ రాతనిఁ దేరే (॥॥) తప్పక చూచినాను తనివోని యాసలు వొప్పుగ నెడ మాటల నూరడిలీనా ముప్పిరి నెడ మాటల ముంచుకొన్న వేడుక చప్పు డాలించి నంతలోఁ జాలఁబోయీనా (॥॥) సరసము లాడినాను జడియని వలపులు తెరమాఁటు సన్నలనుఁ దీర్చవచ్చీనా నిరతపు సన్నల నిండు కొన్నకోరికెలు గరిమ నవ్వినంతనే కాఁక వాపీనా (॥॥) కాయముఁ గాయముఁ గూడి కడివోని తమకము చేయెత్తి సేసవెట్టి తే సెలవయ్యీనా యీ యెడ శ్రీ వేంకటేశుఁ డే నలమేలుమంగను చాయకు వచ్చి నన్నేలె జంట వాసీనా English(||pallavi||) yela baya līm̐diṁchere yiṁtulāla melimi batti galigide mī rādanim̐ dere (||||) tappaga sūsinānu tanivoni yāsalu vŏppuga nĕḍa māḍala nūraḍilīnā muppiri nĕḍa māḍala muṁchugŏnna veḍuga sappu ḍāliṁchi naṁtalom̐ jālam̐boyīnā (||||) sarasamu lāḍinānu jaḍiyani valabulu tĕramām̐ṭu sannalanum̐ dīrsavachchīnā niradabu sannala niṁḍu kŏnnagorigĕlu garima navvinaṁtane kām̐ka vābīnā (||||) kāyamum̐ gāyamum̐ gūḍi kaḍivoni tamagamu seyĕtti sesavĕṭṭi te sĕlavayyīnā yī yĕḍa śhrī veṁkaḍeśhum̐ ḍe nalamelumaṁganu sāyagu vachchi nannelĕ jaṁṭa vāsīnā