Title (Indic)యెటువంటి యాగడీఁడే యీ కృష్ణుఁడు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) యెటువంటి యాగడీఁడే యీ కృష్ణుఁడు జొటజొటఁ గారఁగానే జుఱ్ఱీ మీఁగడలు (॥॥) కొట్టేఁ గృష్ణుఁడు వాఁడె కోలలెత్తి వుట్లపై దట్టముగ గొల్లెతలు దాఁచిన పాలు చుట్టిన చక్కిలములు చొక్కపు నురుగులునుఁ బెట్టిన కాఁగులతోనే పెంచులుగఁజేసీనే (॥॥) దొంతులు దించి దించి దొరకొనీ కృష్ణుఁడు బంతిఁ జక్కెర వెట్టీ గోపాలుల కెల్ల మంతనాన వద్దని మానుపఁబోతేఁదాను కొంత వారి నోరఁ బెరుగులు చమరీనే (॥॥) వీదు లెల్లఁ దానె శ్రీ వేంకటాద్రికృష్ణుఁడు ఆదిగొని మెసగీని యడుకు లెల్ల కాదని పెనఁగితేను కౌఁగిలించి గొల్లెతల సోదించి కుచములంటి సొంపు గాఁగూడీనే English(||pallavi||) yĕḍuvaṁṭi yāgaḍīm̐ḍe yī kṛṣhṇum̐ḍu jŏḍajŏḍam̐ gāram̐gāne juṭrī mīm̐gaḍalu (||||) kŏṭṭem̐ gṛṣhṇum̐ḍu vām̐ḍĕ kolalĕtti vuṭlabai daṭṭamuga gŏllĕdalu dām̐sina pālu suṭṭina sakkilamulu sŏkkabu nurugulunum̐ bĕṭṭina kām̐guladone pĕṁchulugam̐jesīne (||||) dŏṁtulu diṁchi diṁchi dŏragŏnī kṛṣhṇum̐ḍu baṁtim̐ jakkĕra vĕṭṭī gobālula kĕlla maṁtanāna vaddani mānubam̐bodem̐dānu kŏṁta vāri noram̐ bĕrugulu samarīne (||||) vīdu lĕllam̐ dānĕ śhrī veṁkaḍādrikṛṣhṇum̐ḍu ādigŏni mĕsagīni yaḍugu lĕlla kādani pĕnam̐gidenu kaum̐giliṁchi gŏllĕdala sodiṁchi kusamulaṁṭi sŏṁpu gām̐gūḍīne