Title (Indic)విన్నవించరే యీమాట వెలఁదులాల WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) విన్నవించరే యీమాట వెలఁదులాల పన్ని తన సుద్దులేమి బాయిట వేయనే (॥విన్న॥) జగమెల్ల నెరఁగఁగ సతి నయితిఁ దనకు తగ వించుకంతా దప్ప తనపాలికి వెగటుగా దానెంత వేడుక కాఁడైనాను నగేఁగాని వింతతనము సేయనే (॥విన్న॥) సిగ్గు నెగ్గులు నెంచక చిత్తమురా నడచితి దగ్గరి దక్కి వుంటిని తనపాలికి వెగ్గళించి తనసేఁత వెల్లావిరులైనను వొగ్గి తన్ను మెచ్చేఁగాని వొరటులు చూపనే (॥విన్న॥) కలసి మెలసి వుండి కాఁగిలించుకొంటిని తలఁపు వొప్పగించితి తనపాలికి యెనసె శ్రీ వేంకటేశుఁడిఁక నేమి సేసినాను చనవిచ్చేఁగాని మరి సాదించనేరనే English(||pallavi||) vinnaviṁchare yīmāḍa vĕlam̐dulāla panni tana suddulemi bāyiḍa veyane (||vinna||) jagamĕlla nĕram̐gam̐ga sadi nayidim̐ danagu taga viṁchugaṁtā dappa tanabāligi vĕgaḍugā dānĕṁta veḍuga kām̐ḍainānu nagem̐gāni viṁtadanamu seyane (||vinna||) siggu nĕggulu nĕṁchaga sittamurā naḍasidi daggari dakki vuṁṭini tanabāligi vĕggaḽiṁchi tanasem̐ta vĕllāvirulainanu vŏggi tannu mĕchchem̐gāni vŏraḍulu sūbane (||vinna||) kalasi mĕlasi vuṁḍi kām̐giliṁchugŏṁṭini talam̐pu vŏppagiṁchidi tanabāligi yĕnasĕ śhrī veṁkaḍeśhum̐ḍim̐ka nemi sesinānu sanavichchem̐gāni mari sādiṁchanerane