Title (Indic)విన వేడుకయ్యీ మాకు వింతలైన మీ సుద్దులు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) విన వేడుకయ్యీ మాకు వింతలైన మీ సుద్దులు యెనలేని ముచ్చటలు యెటువంటివో (॥॥) యెంగిలిపెదవి వంచి ఇందాఁకా నీ చేతిలోన- నంగవించి మాటలాడె నది యెవ్వతో పొంగుచు నీ మేన నిట్టె పులకలు గడునిండె సంగతి న వెటువంటిసంతోసములో (॥॥) చెమటచన్నులు దాఁక చేలాగు నీకు నిచ్చి అమర లోనికిఁ దెచ్చె నది యెవ్వతో తమితోఁ గళలు రేఁగి తతి నివ్వెర గైతివి సమమైన వెటువంటిసంగడిపొందులో (॥॥) జవ్వనమదము గార సదమదముగ నిన్ను అవ్వలఁ గాఁగిటఁ గూడె నది యెవ్వతో ఇవ్వల శ్రీ వేంకటేశ ఇటు నన్ను నేలితివి వువ్విళ్లూర నెటువంటి వుపాయములో English(||pallavi||) vina veḍugayyī māgu viṁtalaina mī suddulu yĕnaleni muchchaḍalu yĕḍuvaṁṭivo (||||) yĕṁgilibĕdavi vaṁchi iṁdām̐kā nī sedilona- naṁgaviṁchi māḍalāḍĕ nadi yĕvvado pŏṁgusu nī mena niṭṭĕ pulagalu gaḍuniṁḍĕ saṁgadi na vĕḍuvaṁṭisaṁtosamulo (||||) sĕmaḍasannulu dām̐ka selāgu nīgu nichchi amara lonigim̐ dĕchchĕ nadi yĕvvado tamidom̐ gaḽalu rem̐gi tadi nivvĕra gaidivi samamaina vĕḍuvaṁṭisaṁgaḍibŏṁdulo (||||) javvanamadamu gāra sadamadamuga ninnu avvalam̐ gām̐giḍam̐ gūḍĕ nadi yĕvvado ivvala śhrī veṁkaḍeśha iḍu nannu nelidivi vuvviḽlūra nĕḍuvaṁṭi vubāyamulo