Title (Indic)వింటిమి ఇవీఁ గొన్ని వింతలు నేఁడు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) వింటిమి ఇవీఁ గొన్ని వింతలు నేఁడు ఇంటిలోనే వుంటిమి నే మెఱుఁగ మీ సుద్దులు (॥॥) అద్దమ రేతిరి కాడ నట్టే తలుపు దొబ్బుక వొద్దఁ గూచుండె నట వేరొకతె వచ్చి నిద్దిరించఁగా మెల్లనే నీ పాదాల పైఁ జేయి వేసి గుద్దితే లేచితి మాట గురుతౌనా విభుఁడ (॥॥) వేళగానివేళ వచ్చి వెస నిచ్చకము సేసి మేలమాడె నట యీ మేకులకును చాలుకో నీ జోలి తోడ జాగరాలు సేయించఁగ ఆలించుక వుంటి వట అవునా నీవు (॥॥) వాకిటివా రాపొద్దు వద్దనఁగాఁ గడు మించి నీకు వచ్చి మొక్కె నట నేరుపు తోడ యీకడ శ్రీ వేంకటేశ యేలితివి నన్ను నిట్టే లోకములోఁ దమ కెల్ల లోనయ్యేటి వాఁ డవా English(||pallavi||) viṁṭimi ivīm̐ gŏnni viṁtalu nem̐ḍu iṁṭilone vuṁṭimi ne mĕṟum̐ga mī suddulu (||||) addama rediri kāḍa naṭṭe talubu dŏbbuga vŏddam̐ gūsuṁḍĕ naḍa verŏgadĕ vachchi niddiriṁcham̐gā mĕllane nī pādāla paim̐ jeyi vesi guddide lesidi māḍa gurudaunā vibhum̐ḍa (||||) veḽagāniveḽa vachchi vĕsa nichchagamu sesi melamāḍĕ naḍa yī megulagunu sālugo nī joli toḍa jāgarālu seyiṁcham̐ga āliṁchuga vuṁṭi vaḍa avunā nīvu (||||) vāgiḍivā rābŏddu vaddanam̐gām̐ gaḍu miṁchi nīgu vachchi mŏkkĕ naḍa nerubu toḍa yīgaḍa śhrī veṁkaḍeśha yelidivi nannu niṭṭe logamulom̐ dama kĕlla lonayyeḍi vām̐ ḍavā