Title (Indic)వేవేలు దండాలు నీకు విడరా నన్ను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) వేవేలు దండాలు నీకు విడరా నన్ను యీవల నింత లేకున్న యెట్లు దరించేవురా (॥వేవేలు॥) వాడుఁగన్నుల చూపుల వడి నాపై నొరగేవు యేడ నేరుచుకొంటివి యేరా నీవు ఆడికెకు నామీఁద నంత బత్తి గలయట్టె వీడె మియ్య వచ్చేవు వెరతురా నీకు (॥వేవేలు॥) నవ్వుల జాణతనాలు నయగారి వినయాలు యెవ్వతె నేరిపెరా యేరా నీకు పవ్వళించి యింతలోనె పైఁ గాలు చాఁచేవు జవ్వని నింత యాఁప దోసమురా నీకు (॥వేవేలు॥) కామించి కలయు మని కాఁగిటిలో దైన్యములు యేమి అభ్యసించితవి యేరా నీవు చే ముంచి శ్రీవెంకటేశ చెలఁగి కూడితి నన్ను వాముల ని దెల్లా మరవకురా నీవూ English(||pallavi||) vevelu daṁḍālu nīgu viḍarā nannu yīvala niṁta legunna yĕṭlu dariṁchevurā (||vevelu||) vāḍum̐gannula sūbula vaḍi nābai nŏragevu yeḍa nerusugŏṁṭivi yerā nīvu āḍigĕgu nāmīm̐da naṁta batti galayaṭṭĕ vīḍĕ miyya vachchevu vĕradurā nīgu (||vevelu||) navvula jāṇadanālu nayagāri vinayālu yĕvvadĕ neribĕrā yerā nīgu pavvaḽiṁchi yiṁtalonĕ paim̐ gālu sām̐sevu javvani niṁta yām̐pa dosamurā nīgu (||vevelu||) kāmiṁchi kalayu mani kām̐giḍilo dainyamulu yemi abhyasiṁchidavi yerā nīvu se muṁchi śhrīvĕṁkaḍeśha sĕlam̐gi kūḍidi nannu vāmula ni dĕllā maravagurā nīvū