Title (Indic)వేవేగఁ బ్రియాలు చెప్పి వేఁడుకొనీఁ గాక నన్ను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) వేవేగఁ బ్రియాలు చెప్పి వేఁడుకొనీఁ గాక నన్ను చేవమీరి విన్నపాలు సేసేనా నేను (॥॥) చెక్కులే నొక్కితిఁ గాని చేతిగోర నూఁదనైతి మొక్కితిఁగాని కాఁకల మొరయనైతి నిక్కి చూచితిఁ గాని నెరుసు వెదకనైతి చికిం(క్కిం)చుక విన్నపాలు సేసేనా నేను (॥॥) విరులవేసితిఁ గాని వెట్టగాఁ జెనకనైతి సరుగ నవ్వితిగాని జంకించనైతి తిరి గిచూచితిఁగాని దీకొని మాటాడనైతి సిరిమించి విన్నపాలు సేసేనా నేను (॥॥) అలమితిఁగాని నే నదలించి దూరనైతి పిలిచితిఁ గానీ మరి బిగియనైతి యెలమి శ్రీవేంకటేశుఁడే నలమేలుమంగను చెలఁరేగి విన్నపాలు సేసేనా నేను English(||pallavi||) vevegam̐ briyālu sĕppi vem̐ḍugŏnīm̐ gāga nannu sevamīri vinnabālu sesenā nenu (||||) sĕkkule nŏkkidim̐ gāni sedigora nūm̐danaidi mŏkkidim̐gāni kām̐kala mŏrayanaidi nikki sūsidim̐ gāni nĕrusu vĕdaganaidi sigiṁ(kkiṁ)suga vinnabālu sesenā nenu (||||) virulavesidim̐ gāni vĕṭṭagām̐ jĕnaganaidi saruga navvidigāni jaṁkiṁchanaidi tiri gisūsidim̐gāni dīgŏni māḍāḍanaidi sirimiṁchi vinnabālu sesenā nenu (||||) alamidim̐gāni ne nadaliṁchi dūranaidi pilisidim̐ gānī mari bigiyanaidi yĕlami śhrīveṁkaḍeśhum̐ḍe nalamelumaṁganu sĕlam̐regi vinnabālu sesenā nenu