Title (Indic)వెన్న వేసినట్టివారి వెస రాతవేసినట్టు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) వెన్న వేసినట్టివారి వెస రాతవేసినట్టు యెన్నికలు మీరి వచ్చీ నేమందు నితని (॥వెన్న॥) చిగురుఁ బెదవి వంచి సెలవినవ్వులు ముంచి తగిన మాటాడితిని దాఁచితినటే మొగమెత్తనైతి నంటా మోము చూడనైతినంటా జగడాలకే వచ్చి సారెకు నిదేమే (॥వెన్న॥) తొలుతనే కానుకిచ్చి తొంగలి రెప్పలు విచ్చి కొలువులో నేనుంటిఁ గొంకితినటే ఆలరి దగ్గరనంటా నంది విడె మియ్యనంటా అలుకమోమున నున్నాఁ డౌనౌనే తాను (॥వెన్న॥) చి త్తమెల్లా నీరై చెలులలో దూరై త త్తరించి కలసితి తక్కితినటే అత్తిన శ్రీవేంకటేశుఁ డట్టె మఱచితినంటా వొత్తి గోర నెచ్చరించీ నోయమ్మ తాను English(||pallavi||) vĕnna vesinaṭṭivāri vĕsa rādavesinaṭṭu yĕnnigalu mīri vachchī nemaṁdu nidani (||vĕnna||) sigurum̐ bĕdavi vaṁchi sĕlavinavvulu muṁchi tagina māḍāḍidini dām̐sidinaḍe mŏgamĕttanaidi naṁṭā momu sūḍanaidinaṁṭā jagaḍālage vachchi sārĕgu nideme (||vĕnna||) tŏludane kānugichchi tŏṁgali rĕppalu vichchi kŏluvulo nenuṁṭim̐ gŏṁkidinaḍe ālari daggaranaṁṭā naṁdi viḍĕ miyyanaṁṭā alugamomuna nunnām̐ ḍaunaune tānu (||vĕnna||) si ttamĕllā nīrai sĕlulalo dūrai ta ttariṁchi kalasidi takkidinaḍe attina śhrīveṁkaḍeśhum̐ ḍaṭṭĕ maṟasidinaṁṭā vŏtti gora nĕchchariṁchī noyamma tānu