Title (Indic)వెలఁదివిరహ మెంతో విన్నవించితిమి నీకు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) వెలఁదివిరహ మెంతో విన్నవించితిమి నీకు తలఁపు దలఁపు మీకే తారుకాణలైనవి (॥వెల॥) మాట లెందున్నవోకాని మగువకోర్కులు నీ - తేటలమోవియందే తిరమైనవి నీటుఁజూపు లెందున్నవో నివ్వెరగై వూర్పులెల్లా కూటున నీముద్రలపైఁ గుమ్మరించినవి (॥వెల॥) వివర మెందున్నదో వెలఁదికి వీను లివె తవిలి నీసుద్దులందే తావైనవి వువిదకు గమన మెందున్నదో పాదములు యివల నీవున్నవీది కిటు మొకమైనవి (॥వెల॥) పంత మెందున్నదోకాని పడఁతికి వినయాలు చెంతల నీదూతికకే సెలవైనవి యింతలో శ్రీవేంకటేశ యిట్టే విచ్చేసి చెలని సంతసానఁ గూడఁగాను జయము చేకొన్నది English(||pallavi||) vĕlam̐diviraha mĕṁto vinnaviṁchidimi nīgu talam̐pu dalam̐pu mīge tārugāṇalainavi (||vĕla||) māḍa lĕṁdunnavogāni maguvagorgulu nī - teḍalamoviyaṁde tiramainavi nīḍum̐jūbu lĕṁdunnavo nivvĕragai vūrbulĕllā kūḍuna nīmudralabaim̐ gummariṁchinavi (||vĕla||) vivara mĕṁdunnado vĕlam̐digi vīnu livĕ tavili nīsuddulaṁde tāvainavi vuvidagu gamana mĕṁdunnado pādamulu yivala nīvunnavīdi kiḍu mŏgamainavi (||vĕla||) paṁta mĕṁdunnadogāni paḍam̐tigi vinayālu sĕṁtala nīdūdigage sĕlavainavi yiṁtalo śhrīveṁkaḍeśha yiṭṭe vichchesi sĕlani saṁtasānam̐ gūḍam̐gānu jayamu segŏnnadi