Title (Indic)వేగిరమా యిప్పుడేమి వేఁడి వలపు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) వేగిరమా యిప్పుడేమి వేఁడి వలపు చేఁగదేరఁగా నీవే చేరి మన్నించేవు (॥వేగి॥) మాటలు నీతోనాడి మనసులు సోదించ అఁటది నేరుచునా అంతేసి పాటించి పూడిగాలుసేసే బల్లిదురాలనైతేను నీటున నీగుట్టెల్లా నీవే ఆనతిచ్చేవు (॥వేగి॥) సన్నలు నీతోడినాడి చాయకు నిన్ను దిద్దుకో కన్నెలు నేరుతురా కపటాలను అన్నిటా యిచ్చలాడీ సుద్దాత్మురాలనైతేను వున్నతి వోజకు వచ్చి వుబ్బున మెచ్చేవు (॥వేగి॥) మెల్లనే నిన్నుఁ బొగడి మేరలు మాఱి నవ్వఁగా యిల్లాండ్రతరమా యెందునైనాను యిల్లిదె శ్రీవేంకటేశ యెనలుతి విట్లయితే పల్లదాన నెప్పుడూనుఁ బాయకవుండేవు English(||pallavi||) vegiramā yippuḍemi vem̐ḍi valabu sem̐gaderam̐gā nīve seri manniṁchevu (||vegi||) māḍalu nīdonāḍi manasulu sodiṁcha am̐ṭadi nerusunā aṁtesi pāḍiṁchi pūḍigālusese ballidurālanaidenu nīḍuna nīguṭṭĕllā nīve ānadichchevu (||vegi||) sannalu nīdoḍināḍi sāyagu ninnu diddugo kannĕlu nerudurā kabaḍālanu anniḍā yichchalāḍī suddātmurālanaidenu vunnadi vojagu vachchi vubbuna mĕchchevu (||vegi||) mĕllane ninnum̐ bŏgaḍi meralu māṟi navvam̐gā yillāṁḍradaramā yĕṁdunainānu yillidĕ śhrīveṁkaḍeśha yĕnaludi viṭlayide palladāna nĕppuḍūnum̐ bāyagavuṁḍevu