Title (Indic)వేగి లేచి సేసేదెల్లా వెలఁదులతోడి పొందే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) వేగి లేచి సేసేదెల్లా వెలఁదులతోడి పొందే ఆగడపు తలపోత లాఁప నెట్టు వచ్చును* (॥॥) ఆసోదాన జవరాలు ఆపొద్దటనుండియును వేసరక చేసీని విన్నపములు వాసుకో పొస్తకాన నివ్వల మఱవకుండాను యేసుద్దులకైనాను యెచ్చరిక వలెను (॥॥) సారె సారె నీదేవులు సముకాననే వుండి వూరటలేక చేసీని వూడిగములు గారవించి రేపటికి కణఁ జాలనిండాఁ బెట్టు దారదప్పకుండాఁ గొంత దాఁపిరికము వలెను (॥॥) తొలఁగక పెండ్లికూఁతురు నిన్నుఁ గలయచు గిలిగింపుచుఁ బెంచీ కాఁగిట రతులు యెలమి శ్రీ వేంకటేశ యేలితివి నన్ను నిట్టె నెలకొన్న నవ్వులకు నేరుపులు వలెను English(||pallavi||) vegi lesi sesedĕllā vĕlam̐duladoḍi pŏṁde āgaḍabu talaboda lām̐pa nĕṭṭu vachchunu* (||||) āsodāna javarālu ābŏddaḍanuṁḍiyunu vesaraga sesīni vinnabamulu vāsugo pŏstagāna nivvala maṟavaguṁḍānu yesuddulagainānu yĕchchariga valĕnu (||||) sārĕ sārĕ nīdevulu samugānane vuṁḍi vūraḍalega sesīni vūḍigamulu gāraviṁchi rebaḍigi kaṇam̐ jālaniṁḍām̐ bĕṭṭu dāradappaguṁḍām̐ gŏṁta dām̐pirigamu valĕnu (||||) tŏlam̐gaga pĕṁḍligūm̐turu ninnum̐ galayasu giligiṁpusum̐ bĕṁchī kām̐giḍa radulu yĕlami śhrī veṁkaḍeśha yelidivi nannu niṭṭĕ nĕlagŏnna navvulagu nerubulu valĕnu