Title (Indic)వీరి వారివలె నేను వింతదాననా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) వీరి వారివలె నేను వింతదాననా నేరక నీ వుండినాను నే మెచ్చక మానను (॥వీరి వారి॥) వలచిన మేలు నీవు వలవ కున్నా మేలు తలఁపు నీమీఁద నాకుఁ దగిలి పోదు అలిమి పట్టఁగ వద్దు ఆనలు వెట్టఁగ వద్దు చెలిమి నీతో నెవుడుఁ జేయక నే మానను (॥వీరి వీరి॥) యింటికి వచ్చిన మేలు యేడ నున్నా మేలు నీ వెంట వెంటఁ దిరిగి సేవించక పోను తొంటిపొందు చెప్ప వద్దు దొమ్మిఁ జెక్కు నొక్క వద్దు అంటి ముట్టి సరసము లాడక నే మాననూ (॥వీరి వారి॥) యివ్వలమో మైన మేలు యెటువలె నున్న మేలు నెవ్వగ దీరఁ గూడక నే మానను రవ్వగ శ్రీవెంకటేశ రతిఁ జొక్కించితి విదె పువ్వువలె నిన్ను నేఁ బొదుగక మానను English(||pallavi||) vīri vārivalĕ nenu viṁtadānanā neraga nī vuṁḍinānu ne mĕchchaga mānanu (||vīri vāri||) valasina melu nīvu valava kunnā melu talam̐pu nīmīm̐da nāgum̐ dagili podu alimi paṭṭam̐ga vaddu ānalu vĕṭṭam̐ga vaddu sĕlimi nīdo nĕvuḍum̐ jeyaga ne mānanu (||vīri vīri||) yiṁṭigi vachchina melu yeḍa nunnā melu nī vĕṁṭa vĕṁṭam̐ dirigi seviṁchaga ponu tŏṁṭibŏṁdu sĕppa vaddu dŏmmim̐ jĕkku nŏkka vaddu aṁṭi muṭṭi sarasamu lāḍaga ne mānanū (||vīri vāri||) yivvalamo maina melu yĕḍuvalĕ nunna melu nĕvvaga dīram̐ gūḍaga ne mānanu ravvaga śhrīvĕṁkaḍeśha radim̐ jŏkkiṁchidi vidĕ puvvuvalĕ ninnu nem̐ bŏdugaga mānanu