Title (Indic)వీడెమియ్యఁ గదవే విభునికిని WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) వీడెమియ్యఁ గదవే విభునికిని వేడుకలు గొనసాగె వెరగు లిఁకనేలే (॥వీడె॥) చేరి యాకతాన నుండి సిగ్గులువడఁగనేలే కోరి వావిచెప్పి మరి కొంకఁగనేలే సారెఁ బయ్యద జారీని చక్కఁబెట్టుకొననేలే తారుకాణాయఁ బొందులు తరితీపులేలే (॥వీడె॥) తప్పక మోముచూచి తలవంపు లిఁకనేలే కొప్పువీడె గొణఁగుతాఁ గొసరనేలె చిప్పిలఁ జెమట లుబ్బెఁ జిమ్ముచుఁ బెనఁగనేలే వొప్పుగా మర్మము లంటె వొడఁబాటులేలే (॥వీడె॥) పొత్తులవిడెము లంది పొంతనా లడుగనేలే గుత్తపుగబ్బల నూఁది కొదుకనేలే బత్తితో నలమేల్ మంగపతి శ్రీవేంకటేశుఁడు చిత్తగించి నిన్నునేలె చేసన్నలేలే English(||pallavi||) vīḍĕmiyyam̐ gadave vibhunigini veḍugalu gŏnasāgĕ vĕragu lim̐kanele (||vīḍĕ||) seri yāgadāna nuṁḍi sigguluvaḍam̐ganele kori vāvisĕppi mari kŏṁkam̐ganele sārĕm̐ bayyada jārīni sakkam̐bĕṭṭugŏnanele tārugāṇāyam̐ bŏṁdulu taridībulele (||vīḍĕ||) tappaga momusūsi talavaṁpu lim̐kanele kŏppuvīḍĕ gŏṇam̐gudām̐ gŏsaranelĕ sippilam̐ jĕmaḍa lubbĕm̐ jimmusum̐ bĕnam̐ganele vŏppugā marmamu laṁṭĕ vŏḍam̐bāḍulele (||vīḍĕ||) pŏttulaviḍĕmu laṁdi pŏṁtanā laḍuganele guttabugabbala nūm̐di kŏduganele battido nalamel maṁgabadi śhrīveṁkaḍeśhum̐ḍu sittagiṁchi ninnunelĕ sesannalele