Title (Indic)వెదకినఁ దెలియదు వెనక ముందరలు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) వెదకినఁ దెలియదు వెనక ముందరలు పదమున నిలుపవె పరమాత్మా (॥వెద॥) కోరిక లూరక కొనలు సాగఁగా బారలు చాఁచీఁ బ్రపంచము యీరీతి జీవులు ఇలఁ బొడమఁ బొడమ దూరంబాయను తొలుతటి రాక (॥వెద॥) కాయపు మదములు కప్పఁగఁ గప్పఁగ ఆయము లంటీనదె మాయ పాయక ఇందే పనుపడి పనుపడి చాయలు మరచిరి జంతువులు (॥వెద॥) బలుశరణాగతి ప్రాణులు దలఁచఁగ నెలవున నిలిపెను నీకరుణ ఇలపై శ్రీవేంకటేశ్వర యిహ పర- మలవడి దొరకెను అరచేతికిని English(||pallavi||) vĕdaginam̐ dĕliyadu vĕnaga muṁdaralu padamuna nilubavĕ paramātmā (||vĕda||) koriga lūraga kŏnalu sāgam̐gā bāralu sām̐sīm̐ brabaṁchamu yīrīdi jīvulu ilam̐ bŏḍamam̐ bŏḍama dūraṁbāyanu tŏludaḍi rāga (||vĕda||) kāyabu madamulu kappam̐gam̐ gappam̐ga āyamu laṁṭīnadĕ māya pāyaga iṁde panubaḍi panubaḍi sāyalu marasiri jaṁtuvulu (||vĕda||) baluśharaṇāgadi prāṇulu dalam̐sam̐ga nĕlavuna nilibĕnu nīgaruṇa ilabai śhrīveṁkaḍeśhvara yiha para- malavaḍi dŏragĕnu arasedigini