Title (Indic)వెదకిన నిదియే వేదాంతార్థము WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) వెదకిన నిదియే వేదాంతార్థము మొదలు తుదలు హరిమూలంబు (॥వెదకి॥) మునుకొని అవయవములు యెన్నైనా పనివడి శిరసే ప్రధానము యెనలేని సురలు యెందరు గలిగిన మునుపటి హరియే మూలంబు (॥వెదకి॥) మోవని యింద్రియములు యెన్నైనా భావపు మనసే ప్రధానము యీవల మతములు యెన్ని గలిగినా మూవురలో హరి మూలంబు (॥వెదకి॥) యెరవగు గుణములు యెన్ని గలిగినా పరమ జ్ఞానము ప్రధానము యిరవుగ శ్రీ వేంకటేశ్వరు నామమే సరవి మంత్రముల సారంబు English(||pallavi||) vĕdagina nidiye vedāṁtārdhamu mŏdalu tudalu harimūlaṁbu (||vĕdagi||) munugŏni avayavamulu yĕnnainā panivaḍi śhirase pradhānamu yĕnaleni suralu yĕṁdaru galigina munubaḍi hariye mūlaṁbu (||vĕdagi||) movani yiṁdriyamulu yĕnnainā bhāvabu manase pradhānamu yīvala madamulu yĕnni galiginā mūvuralo hari mūlaṁbu (||vĕdagi||) yĕravagu guṇamulu yĕnni galiginā parama jñānamu pradhānamu yiravuga śhrī veṁkaḍeśhvaru nāmame saravi maṁtramula sāraṁbu