Title (Indic)వట్టి చేఁతలు సేయఁగ వచ్చేదేమి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) వట్టి చేఁతలు సేయఁగ వచ్చేదేమి చుట్టరిక మేపొద్దు చూపుట గాక (॥॥) పంతమాడ నేఁటికి బలుదొరవు నీతోడ యెంతైనా నూరకుండేది యెక్కుడు గాక చెంత నొరయ నేఁటికి సిగ్గులెల్ల మెఱయఁగ మంతనానఁ దలఁచుటే మంచిది గాక (॥॥) సారె నవ్వనేఁటికి జాణఁడవు నీతోడ మేరలు మీఱకుండుటే మెచ్చులు గాక ఆరీతిఁ గొసరనేల అలపులు దేరఁగాను తారుకాణగా మెచ్చుటే తగవు గాక (॥॥) చెనకఁగ నేఁటికి శ్రీవేంకటేశ నీతోడఁ జొనిపి రెండుగన్నులఁ జూచుట గాక యెనసితి విదే నన్ను నిన్నిటా మన్నించఁగాను తనువుఁ దనువు సోఁకి తనియుట గాక English(||pallavi||) vaṭṭi sem̐talu seyam̐ga vachchedemi suṭṭariga mebŏddu sūbuḍa gāga (||||) paṁtamāḍa nem̐ṭigi baludŏravu nīdoḍa yĕṁtainā nūraguṁḍedi yĕkkuḍu gāga sĕṁta nŏraya nem̐ṭigi siggulĕlla mĕṟayam̐ga maṁtanānam̐ dalam̐suḍe maṁchidi gāga (||||) sārĕ navvanem̐ṭigi jāṇam̐ḍavu nīdoḍa meralu mīṟaguṁḍuḍe mĕchchulu gāga ārīdim̐ gŏsaranela alabulu deram̐gānu tārugāṇagā mĕchchuḍe tagavu gāga (||||) sĕnagam̐ga nem̐ṭigi śhrīveṁkaḍeśha nīdoḍam̐ jŏnibi rĕṁḍugannulam̐ jūsuḍa gāga yĕnasidi vide nannu ninniḍā manniṁcham̐gānu tanuvum̐ danuvu som̐ki taniyuḍa gāga