Title (Indic)వలసినప్పుడు మేము వచ్చేముగాని WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) వలసినప్పుడు మేము వచ్చేముగాని మలసి మమ్మీవేళ మన్నించరయ్యా (॥వల॥) తరుణిచిత్తము నీతలఁపు కొలఁదే కాక యెరవుల మామాట యేఁటికయ్యా వొరసి బుద్దులు చెప్పి వొకరి వారముగాము మరిగి వుండేరు మీరే మరి మేమేలయ్యా (॥వల॥) అంగన చలము మీ అలుకకోలఁదే కాక సంగతిగాని నూపొందు చాలునయ్యా వెంగలిచేఁతల మొక్కి విదిలింపించుకొంటిమి ముంగిటనుండేము మాతో మొగమోటేలయ్యా (॥వల॥) వనితప్రియము నీవలపు కొలఁదే కాక తనిసితిమి మానీటు దక్కెనయ్యా చనవున మీకు మీకే చక్కనై కూడితిరిదే ననిచి శ్రీవేంకటేశ నవ్వు నవ్వేమయ్యా English(||pallavi||) valasinappuḍu memu vachchemugāni malasi mammīveḽa manniṁcharayyā (||vala||) taruṇisittamu nīdalam̐pu kŏlam̐de kāga yĕravula māmāḍa yem̐ṭigayyā vŏrasi buddulu sĕppi vŏgari vāramugāmu marigi vuṁḍeru mīre mari memelayyā (||vala||) aṁgana salamu mī alugagolam̐de kāga saṁgadigāni nūbŏṁdu sālunayyā vĕṁgalisem̐tala mŏkki vidiliṁpiṁchugŏṁṭimi muṁgiḍanuṁḍemu mādo mŏgamoḍelayyā (||vala||) vanidapriyamu nīvalabu kŏlam̐de kāga tanisidimi mānīḍu dakkĕnayyā sanavuna mīgu mīge sakkanai kūḍidiride nanisi śhrīveṁkaḍeśha navvu navvemayyā