Title (Indic)వలచిన పతి వాఁడే వచ్చినదాన నే నిదె WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) వలచిన పతి వాఁడే వచ్చినదాన నే నిదె తలఁపులుఁ దలపులు తారుకాణ లెన్నఁడే (॥వల॥) పచ్చఁబుచ్చఁబున్నములు పొలఁతి నీనవ్వులు యిచ్చట నీపతిఁ జూచే దిఁక నెన్నడే నిచ్చ నిచ్చఁ గొత్తలాయ నెలఁత నీజవ్వనము మెచ్చి మెచ్చి ఆతనితో మేలమాడు టెన్నఁడే (॥వల॥) వండవండ నట్లాయ వాడిక నీవలపు నిండినపతి కాఁగిట నించు టెన్నడే వుండ నుండ నొగరాయ వువిద నీజంకెనలు అండ నాతనికి వినయాలు సేయు టెన్నఁడే (॥వల॥) తినఁదినఁ దీపులాయ తెరవ నీమోవిజున్ను పొనిఁగి శ్రీవేంకటెశుపొందు లెన్నఁడే ననిచి యాతఁడే నేఁడు నయముల నిన్నుఁ గూడె మనకి మీలోలోన మందలించు టెన్నఁడే English(||pallavi||) valasina padi vām̐ḍe vachchinadāna ne nidĕ talam̐pulum̐ dalabulu tārugāṇa lĕnnam̐ḍe (||vala||) pachcham̐buchcham̐bunnamulu pŏlam̐ti nīnavvulu yichchaḍa nībadim̐ jūse dim̐ka nĕnnaḍe nichcha nichcham̐ gŏttalāya nĕlam̐ta nījavvanamu mĕchchi mĕchchi ādanido melamāḍu ṭĕnnam̐ḍe (||vala||) vaṁḍavaṁḍa naṭlāya vāḍiga nīvalabu niṁḍinabadi kām̐giḍa niṁchu ṭĕnnaḍe vuṁḍa nuṁḍa nŏgarāya vuvida nījaṁkĕnalu aṁḍa nādanigi vinayālu seyu ṭĕnnam̐ḍe (||vala||) tinam̐dinam̐ dībulāya tĕrava nīmovijunnu pŏnim̐gi śhrīveṁkaḍĕśhubŏṁdu lĕnnam̐ḍe nanisi yādam̐ḍe nem̐ḍu nayamula ninnum̐ gūḍĕ managi mīlolona maṁdaliṁchu ṭĕnnam̐ḍe