Title (Indic)వలపించ నేరుతువు వడి నేఁచనేరుతువు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) వలపించ నేరుతువు వడి నేఁచనేరుతువు సిలుగు కోప నీవు సేసినట్టె సేయరా (॥వల॥) ప్రియముతోడుత నన్నుఁ బిలిచేవు యీ నయమె యీడేర నడపేవా బయకారించే నీచే బడలితిని నీ చెయి మీఁ దింతె నీవు సేసినట్టె సేయరా (॥వల॥) దగ్గరి నాతో మంచితన మాడేవు యీ నిగ్గుల నీమే లిట్టె నిలిపేవా వెగ్గళించే నీచేత విసిగితిని నాకు సెగ్గెము గాదు నీవు సేసినట్టె సేయరా (॥వల॥) కలసితి నన్ను శ్రీవెంకటనాథుడా నీ తలఁపులో దయ నాపైఁ దప్పేనా యెలయింపు నీచేత నింతైతిని నాపై చెలిమిగలవు నీవు సేసినట్టె సేయరా English(||pallavi||) valabiṁcha neruduvu vaḍi nem̐saneruduvu silugu koba nīvu sesinaṭṭĕ seyarā (||vala||) priyamudoḍuda nannum̐ bilisevu yī nayamĕ yīḍera naḍabevā bayagāriṁche nīse baḍalidini nī sĕyi mīm̐ diṁtĕ nīvu sesinaṭṭĕ seyarā (||vala||) daggari nādo maṁchidana māḍevu yī niggula nīme liṭṭĕ nilibevā vĕggaḽiṁche nīseda visigidini nāgu sĕggĕmu gādu nīvu sesinaṭṭĕ seyarā (||vala||) kalasidi nannu śhrīvĕṁkaḍanāthuḍā nī talam̐pulo daya nābaim̐ dappenā yĕlayiṁpu nīseda niṁtaidini nābai sĕlimigalavu nīvu sesinaṭṭĕ seyarā