Title (Indic)వద్దువద్దు అంతేసి వైతాళాలు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) వద్దువద్దు అంతేసి వైతాళాలు వుద్దండాలు సేయఁబోతే వుట్టిలేక వూఁగవా (॥వద్దు॥) సిగ్గువడి నే నీచేతికి లోనైతినంటా వెగ్గళించి యెమ్మెలేల వెదచల్లేవు అగ్గలమైన నే నిన్ను అందుకు మీఱఁజూచితే బెగ్గలి మచ్చరములే పెరుగుతానుండవే (॥వద్దు॥) మొగమోటతోడ నే నీముందర నుందాననంటా నగుతా నీసుద్దులేల నారువోసేవు మగటిమి నే నీకు మారుకు మారు సేసితే చిగిరించి పంతములే చిమ్మిరేఁగవా (॥వద్దు॥) ఆసపడి నేను నీయాలనై వుందాననంటా వాసులకు నన్నునేల వలఁబెట్టేవు వేసరక నేనే శ్రీవేంకటేశ కూడితిని తాసువంటివలపులు తారుమారు గావా English(||pallavi||) vadduvaddu aṁtesi vaidāḽālu vuddaṁḍālu seyam̐bode vuṭṭilega vūm̐gavā (||vaddu||) sigguvaḍi ne nīsedigi lonaidinaṁṭā vĕggaḽiṁchi yĕmmĕlela vĕdasallevu aggalamaina ne ninnu aṁdugu mīṟam̐jūside bĕggali machcharamule pĕrugudānuṁḍave (||vaddu||) mŏgamoḍadoḍa ne nīmuṁdara nuṁdānanaṁṭā nagudā nīsuddulela nāruvosevu magaḍimi ne nīgu mārugu māru seside sigiriṁchi paṁtamule simmirem̐gavā (||vaddu||) āsabaḍi nenu nīyālanai vuṁdānanaṁṭā vāsulagu nannunela valam̐bĕṭṭevu vesaraga nene śhrīveṁkaḍeśha kūḍidini tāsuvaṁṭivalabulu tārumāru gāvā