Title (Indic)వద్దు వద్దు రమ్మనవే వలవని జాగు లేల WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) వద్దు వద్దు రమ్మనవే వలవని జాగు లేల నిద్దురకన్నుల తేట నేనే యెరుఁగుదునే (॥వద్దు॥) మంచము మీఁదటి మాఁట మరచెనా తానేమైన కంచము పొత్తుల చవి కానఁడా తాను ఇంచుకంత వట్టి గుట్టులేల మాతోఁ జేసీని నించేటి తన లాగులు నేనే యెఱుఁగుదునే (॥వద్దు॥) గుబ్బల గుజ్జనగూళ్లు గోర నూఁది చూడఁడా వుబ్బుఁగవణపు పుక్కి లున్నదిగదె మబ్బువయసు మదము మాపైనేల కప్పీనే నిబ్బరపు తనతమి నేనే యెఱుఁగుదునే (॥వద్దు॥) బీరపు కాఁగిటిపస బిగిఇంచి మెచ్చఁడా సారె జారుఁగొప్పు గురి సరసాలకు యీరీతి శ్రీ వేంకటేశుఁ డింతసేసి నన్నుఁ గూడె నేరుపు నేరములెల్లా నేనే యెరుఁగుదునే English(||pallavi||) vaddu vaddu rammanave valavani jāgu lela nidduragannula teḍa nene yĕrum̐gudune (||vaddu||) maṁchamu mīm̐daḍi mām̐ṭa marasĕnā tānemaina kaṁchamu pŏttula savi kānam̐ḍā tānu iṁchugaṁta vaṭṭi guṭṭulela mādom̐ jesīni niṁcheḍi tana lāgulu nene yĕṟum̐gudune (||vaddu||) gubbala gujjanagūḽlu gora nūm̐di sūḍam̐ḍā vubbum̐gavaṇabu pukki lunnadigadĕ mabbuvayasu madamu mābainela kappīne nibbarabu tanadami nene yĕṟum̐gudune (||vaddu||) bīrabu kām̐giḍibasa bigiiṁchi mĕchcham̐ḍā sārĕ jārum̐gŏppu guri sarasālagu yīrīdi śhrī veṁkaḍeśhum̐ ḍiṁtasesi nannum̐ gūḍĕ nerubu neramulĕllā nene yĕrum̐gudune