Title (Indic)వద్దనున్నారము నేము వాడికవారమెల్లాను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) వద్దనున్నారము నేము వాడికవారమెల్లాను కొద్దిమీరి ముమ్మదము కుంగదెఁ(దెం?)తైనాను (॥వద్ద॥) వెలఁది కొత్తవలపు వేఁడివేఁడి చెమటలు బలిమి ని న్నే పొద్దుఁ బాయఁగలేదు మెలుపుతోడ నీవు మెడఁగట్టుకొనవయ్య తిలకించ నాసోదము తీర దెఁతైనాను (॥వద్ద॥) చెలియ వింతొకచూపు చిరునవ్వు లొకచవి కొలువులో నీతొడపైఁ గూరుచున్నది పొలుపై నీదేవరగా బూజించుకొనవయ్య తలఁపులో నాపెకు తనియ దెఁతైనను (॥వద్ద॥) అంగనకాఁగిటిపెండ్లి అట్టె నాగవెల్లి సంగతిగా నినుఁగూడి సతమాయను యింగితాన శ్రీవేంకటేశుఁడ మన్నించవయ్య చెంగట మాసరుసకె చేరె నెంతయినాను English(||pallavi||) vaddanunnāramu nemu vāḍigavāramĕllānu kŏddimīri mummadamu kuṁgadĕm̐(dĕṁ?)tainānu (||vadda||) vĕlam̐di kŏttavalabu vem̐ḍivem̐ḍi sĕmaḍalu balimi ni nne pŏddum̐ bāyam̐galedu mĕlubudoḍa nīvu mĕḍam̐gaṭṭugŏnavayya tilagiṁcha nāsodamu tīra dĕm̐tainānu (||vadda||) sĕliya viṁtŏgasūbu sirunavvu lŏgasavi kŏluvulo nīdŏḍabaim̐ gūrusunnadi pŏlubai nīdevaragā būjiṁchugŏnavayya talam̐pulo nābĕgu taniya dĕm̐tainanu (||vadda||) aṁganagām̐giḍibĕṁḍli aṭṭĕ nāgavĕlli saṁgadigā ninum̐gūḍi sadamāyanu yiṁgidāna śhrīveṁkaḍeśhum̐ḍa manniṁchavayya sĕṁgaḍa māsarusagĕ serĕ nĕṁtayinānu