Title (Indic)వారివారి కర్మములే వారిఁ జుట్టుకొనఁగాను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) వారివారి కర్మములే వారిఁ జుట్టుకొనఁగాను యీరీతి నీవే వారియెఱుక మాల్పితివి (॥వారి॥) హిరణ్యకశిపుపాటు యెఱుఁగఁడా రావణుఁడు ధరలో హరికిఁ బగై తానూఁ బొలిసె విరసపు కంసుగతి వినఁడా దుర్యోధనుఁడు సరుగఁ దానూఁ బగై సమసినాఁడు (॥వారి॥) తెగి మురాసురుజాడ తెలియఁడా నరకుఁడు మొగిసి పోటుకుఁ బోయి మొక్కపోయను సొగిసి సోముకుదెస చూడరా దానవులెల్లా మగిడి మగడి పోరి మడిసిరి గాక (॥వారి॥) బలివోయిన తెరువు బాణుఁడు విచారించఁడా బలిమిఁ దొడరి భంగపడెఁ గాక యెలమి శ్రీవేంకటేశా యెవ్వరి నేమనవచ్చు యెలమి నిప్పటివార నెఱఁగరే కాక English(||pallavi||) vārivāri karmamule vārim̐ juṭṭugŏnam̐gānu yīrīdi nīve vāriyĕṟuga mālbidivi (||vāri||) hiraṇyagaśhibubāḍu yĕṟum̐gam̐ḍā rāvaṇum̐ḍu dharalo harigim̐ bagai tānūm̐ bŏlisĕ virasabu kaṁsugadi vinam̐ḍā duryodhanum̐ḍu sarugam̐ dānūm̐ bagai samasinām̐ḍu (||vāri||) tĕgi murāsurujāḍa tĕliyam̐ḍā naragum̐ḍu mŏgisi poḍugum̐ boyi mŏkkaboyanu sŏgisi somugudĕsa sūḍarā dānavulĕllā magiḍi magaḍi pori maḍisiri gāga (||vāri||) balivoyina tĕruvu bāṇum̐ḍu visāriṁcham̐ḍā balimim̐ dŏḍari bhaṁgabaḍĕm̐ gāga yĕlami śhrīveṁkaḍeśhā yĕvvari nemanavachchu yĕlami nippaḍivāra nĕṟam̐gare kāga