Title (Indic)వారి వారి సహజాలు వన్నెకెక్కివుండుఁ గాని WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) వారి వారి సహజాలు వన్నెకెక్కివుండుఁ గాని యీరసానఁ దలఁచితే యిక్కువలై తోఁచవు (॥వారి॥) సతులు పెక్కుమాఁటల జరయుదు రూరకైనా మతిలో నెగ్గుపట్టఁడు మగవాఁడు చతురతలు మెరసి జంకింతురు సొలతులు తతి నెంచఁబోతేను తప్పుగాఁ గైకొనఁడు (॥వారి॥) జవ్వనులు కాంతాళించి సణంగులు రాలుతురు రవ్వలుగా నలుగఁడు రమణుఁ డెందు పువ్వులఁగొని వేతురు బుజముల నొరతురు నవ్వుతానే వుండుంగాని నలిరేఁగి తిట్టఁడు (॥వారి॥) జట్టిగొన్నమానినులు సమరతి మీరుదురు గుట్టు బయట వేయండు గుణవంతుఁడు గట్టిగా శ్రీవేంకటేశ కడపలో నన్నేలితి- వెట్టఇనాం దనవిభుఁడే ఇన్నిటాను ఘనుఁడు English(||pallavi||) vāri vāri sahajālu vannĕgĕkkivuṁḍum̐ gāni yīrasānam̐ dalam̐side yikkuvalai tom̐savu (||vāri||) sadulu pĕkkumām̐ṭala jarayudu rūragainā madilo nĕggubaṭṭam̐ḍu magavām̐ḍu saduradalu mĕrasi jaṁkiṁturu sŏladulu tadi nĕṁcham̐bodenu tappugām̐ gaigŏnam̐ḍu (||vāri||) javvanulu kāṁtāḽiṁchi saṇaṁgulu rāluduru ravvalugā nalugam̐ḍu ramaṇum̐ ḍĕṁdu puvvulam̐gŏni veduru bujamula nŏraduru navvudāne vuṁḍuṁgāni nalirem̐gi tiṭṭam̐ḍu (||vāri||) jaṭṭigŏnnamāninulu samaradi mīruduru guṭṭu bayaḍa veyaṁḍu guṇavaṁtum̐ḍu gaṭṭigā śhrīveṁkaḍeśha kaḍabalo nannelidi- vĕṭṭa̮ināṁ danavibhum̐ḍe inniḍānu ghanum̐ḍu