Title (Indic)వారీఁ జూచె దాని వలుపే చూచుట గాక WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) వారీఁ జూచె దాని వలుపే చూచుట గాక సారె నీకిచ్చక మౌటే సంతోసము నాకూ (॥॥) కడఁగి నీ సతు లెంత గర్వముతో నుండినాను అడియాలమగు మాట లాడింతు నేనూ వుడివోని నీ మన్నన నుల్లసము లాడినాను యెడనెడ నందుకుఁగా నెగ్గుపట్ట నేనూ (॥॥) కసరి సవతులు మొగాలు ముడుచుకొన్నాను ముసిమి చెప్పి నవ్వించి మొక్కుదునేను వసగాని కాంతాళాల వాదుకు వచ్చినాను పొసఁగి చుట్టరికానఁ దొందు సేతు నేనూ (॥॥) పక్కన నీ దేవుళ్ళెంత పంతాలు మెఱసినాను మిక్కిలిఁ బొగడుతాను మెచ్చి చెల్లింతు మక్కువతో నలమేలుమంగ శ్రీ వేంకటేశ్వర యిక్కడ నన్నేలితివి యిందరిదాన నేనూ English(||pallavi||) vārīm̐ jūsĕ dāni valube sūsuḍa gāga sārĕ nīgichchaga mauḍe saṁtosamu nāgū (||||) kaḍam̐gi nī sadu lĕṁta garvamudo nuṁḍinānu aḍiyālamagu māḍa lāḍiṁtu nenū vuḍivoni nī mannana nullasamu lāḍinānu yĕḍanĕḍa naṁdugum̐gā nĕggubaṭṭa nenū (||||) kasari savadulu mŏgālu muḍusugŏnnānu musimi sĕppi navviṁchi mŏkkudunenu vasagāni kāṁtāḽāla vādugu vachchinānu pŏsam̐gi suṭṭarigānam̐ dŏṁdu sedu nenū (||||) pakkana nī devuḽḽĕṁta paṁtālu mĕṟasinānu mikkilim̐ bŏgaḍudānu mĕchchi sĕlliṁtu makkuvado nalamelumaṁga śhrī veṁkaḍeśhvara yikkaḍa nannelidivi yiṁdaridāna nenū