Title (Indic)వానివాని స్వభావము వద్దనరాదు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) వానివాని స్వభావము వద్దనరాదు తానందుఁ దొరల నంటే తప్పులు లేవు (॥వాని॥) సొరిది చింతపులుసు చూచితే నోరూరును వరుసలం జవిగొన్నవాఁడు గాఁడు పరగ దేహప్రకృతి పదార్థగుణము లవి తొరల కెఱుఁగుకొంటె దోషము లేదు (॥వాని॥) నెలకొన్న యింతుల వర్ణించితె బుద్ధి చలించు వలసి యంటి ముట్టిన వాఁడు గాఁడు తలఁపు లక్ష్యము గుఱి దాఁకిన భావము లవి తలఁకక తెలిసితే తగు లేమి లేదు (॥వాని॥) రీతితో సర్పమును మంత్రించితే కరవదు వాత సూత్రము గట్టినవాఁడు గాఁడు యీతల శ్రీవేంకటాద్రి యీశ్వరు మహిమ లివి యేతులఁ గొలిచితేను యేకర్మము లేదు English(||pallavi||) vānivāni svabhāvamu vaddanarādu tānaṁdum̐ dŏrala naṁṭe tappulu levu (||vāni||) sŏridi siṁtabulusu sūside norūrunu varusalaṁ javigŏnnavām̐ḍu gām̐ḍu paraga dehaprakṛti padārdhaguṇamu lavi tŏrala kĕṟum̐gugŏṁṭĕ doṣhamu ledu (||vāni||) nĕlagŏnna yiṁtula varṇiṁchidĕ buddhi saliṁchu valasi yaṁṭi muṭṭina vām̐ḍu gām̐ḍu talam̐pu lakṣhyamu guṟi dām̐kina bhāvamu lavi talam̐kaga tĕliside tagu lemi ledu (||vāni||) rīdido sarbamunu maṁtriṁchide karavadu vāda sūtramu gaṭṭinavām̐ḍu gām̐ḍu yīdala śhrīveṁkaḍādri yīśhvaru mahima livi yedulam̐ gŏlisidenu yegarmamu ledu