Title (Indic)వాఁడు నాపైఁ గల ప్రేమ పడి నందె తెలిసెను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) వాఁడు నాపైఁ గల ప్రేమ పడి నందె తెలిసెను పోఁడిమి నాతో నిట్టె బొంకకువే చెలియా (॥వాఁడు॥) విన్నవించినమాటకు వేడుకపడెనో లేదో తిన్న నినవ్వుతో సమ్మతించెనో లేదో పన్ని నీమీఁద నట్టె పరాకై వుండెనో లేదో యిన్నిటా నాకే మేలు యెరిఁగిచఁ గదవే (॥వాఁడు॥) దగ్గరి మీతో నేకతము లాడెనో లేదో బెగ్గిల నీ వన్న యాన పెట్టెనో లేదో యెగ్గులేక నిన్నుఁ గని యెదురు వచ్చెనో లేదో సిగ్గు దీరఁగఁ జెప్పి నాలో చింత వాపఁగదవే (॥వాఁడు॥) కిమ్ముల నీవెంటనే వాకిటికి వచ్చెనో లేదో చిమ్ముల నాపంత మీడేర్చెనో లేదో అమ్మరో శ్రీ వేంకటేశుఁ డదె నన్ను నిట్టె కూడె వమ్మి వానిగుట్టు నాతోఁ బచరించఁగదవే English(||pallavi||) vām̐ḍu nābaim̐ gala prema paḍi naṁdĕ tĕlisĕnu pom̐ḍimi nādo niṭṭĕ bŏṁkaguve sĕliyā (||vām̐ḍu||) vinnaviṁchinamāḍagu veḍugabaḍĕno ledo tinna ninavvudo sammadiṁchĕno ledo panni nīmīm̐da naṭṭĕ parāgai vuṁḍĕno ledo yinniḍā nāge melu yĕrim̐gisam̐ gadave (||vām̐ḍu||) daggari mīdo negadamu lāḍĕno ledo bĕggila nī vanna yāna pĕṭṭĕno ledo yĕggulega ninnum̐ gani yĕduru vachchĕno ledo siggu dīram̐gam̐ jĕppi nālo siṁta vābam̐gadave (||vām̐ḍu||) kimmula nīvĕṁṭane vāgiḍigi vachchĕno ledo simmula nābaṁta mīḍersĕno ledo ammaro śhrī veṁkaḍeśhum̐ ḍadĕ nannu niṭṭĕ kūḍĕ vammi vāniguṭṭu nādom̐ basariṁcham̐gadave