Title (Indic)వాఁడివో వీఁడివో హరి వలసినవారికెల్లా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) వాఁడివో వీఁడివో హరి వలసినవారికెల్లా మూఁడు లోకముల మరి మొరఁగఁ జోటేది (॥వాఁడి॥) బహిరంతరాన హరి ప్రత్యక్షమై యుండఁగాను సహజానఁ బ్రత్యక్ష విచారమేల ఇహములోఁ గలవెల్లా యీతని లీలై యుండఁగా విహరించే లీల వేరే వెదకనేలా (॥వాఁడి॥) మనికై యన్నిటానుండి మాటలాడుచుండఁగాను వెనక హరి మాటలు వేరేవున్నవా కనుచూపతఁ డంతటా కలగొనఁ జూడఁగాను చనవిచ్చి కృపాదృష్టి చల్లుమననేలా (॥వాఁడి॥) నెలవై యాతఁ డిన్నిటా నిండుకొనియుండఁగాను అలరి వేరే వచ్చీనననేలా యెలమి శ్రీవేంకటేశు యిచ్చకొలఁదే యింతా పలుమారు నిట్టట్టని భావించఁ దగునా English(||pallavi||) vām̐ḍivo vīm̐ḍivo hari valasinavārigĕllā mūm̐ḍu logamula mari mŏram̐gam̐ joḍedi (||vām̐ḍi||) bahiraṁtarāna hari pratyakṣhamai yuṁḍam̐gānu sahajānam̐ bratyakṣha visāramela ihamulom̐ galavĕllā yīdani līlai yuṁḍam̐gā vihariṁche līla vere vĕdaganelā (||vām̐ḍi||) manigai yanniḍānuṁḍi māḍalāḍusuṁḍam̐gānu vĕnaga hari māḍalu verevunnavā kanusūbadam̐ ḍaṁtaḍā kalagŏnam̐ jūḍam̐gānu sanavichchi kṛpādṛṣhṭi sallumananelā (||vām̐ḍi||) nĕlavai yādam̐ ḍinniḍā niṁḍugŏniyuṁḍam̐gānu alari vere vachchīnananelā yĕlami śhrīveṁkaḍeśhu yichchagŏlam̐de yiṁtā palumāru niṭṭaṭṭani bhāviṁcham̐ dagunā