Title (Indic)వాఁడివో నీ రమణుఁడు వలసినట్టు సేయనీ WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) వాఁడివో నీ రమణుఁడు వలసినట్టు సేయనీ పేఁడుకొని మాకు నింత పెనఁగ నేమిటికి (॥వాడివో॥) బలిమిఁ బట్టఁగ రాదు పరాకున నుండ రాదు యెలమి నీతోడిపొందు లెటుఁ బో రాదు వలపు తీపన రాదు వడిఁ గార మన రాదు చెలులము సారె బుద్ది చెప్పకుండ రాదు (॥వాడివో॥) నవ్వులు నవ్వఁగ రాదు నాలి నూరకుండ రాదు యివ్వల నీతో సరస మెటుఁబో రాదు జవ్వన మిందుకో రాదు చాలించి పో దొబ్బ రాదు మవ్వపు మీతేఁకువలు మాకుఁ జూడ రాదు (॥వాడివో॥) తప్పక చూడఁగ రాదు తల వంచు కుండ రాదు యెప్పుడు నీతోడిజాడ యెందుఁ బో రాదు అప్పఁడు శ్రీవెంకటేశుఁ డలయేలుమంగ నిన్ను యిప్పుడిట్టె కూడె మాకు నేమీ నన రాదు English(||pallavi||) vām̐ḍivo nī ramaṇum̐ḍu valasinaṭṭu seyanī pem̐ḍugŏni māgu niṁta pĕnam̐ga nemiḍigi (||vāḍivo||) balimim̐ baṭṭam̐ga rādu parāguna nuṁḍa rādu yĕlami nīdoḍibŏṁdu lĕḍum̐ bo rādu valabu tībana rādu vaḍim̐ gāra mana rādu sĕlulamu sārĕ buddi sĕppaguṁḍa rādu (||vāḍivo||) navvulu navvam̐ga rādu nāli nūraguṁḍa rādu yivvala nīdo sarasa mĕḍum̐bo rādu javvana miṁdugo rādu sāliṁchi po dŏbba rādu mavvabu mīdem̐kuvalu māgum̐ jūḍa rādu (||vāḍivo||) tappaga sūḍam̐ga rādu tala vaṁchu kuṁḍa rādu yĕppuḍu nīdoḍijāḍa yĕṁdum̐ bo rādu appam̐ḍu śhrīvĕṁkaḍeśhum̐ ḍalayelumaṁga ninnu yippuḍiṭṭĕ kūḍĕ māgu nemī nana rādu